ఖమేనీ ప్రాణాలతో లేడనే మాట వింటున్నా- ఇరాన్ సరెండర్ కావడం బెటర్: ట్రంప్

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 15వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది.

ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ను సరెండర్ కావాలని సూచించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణాలతో లేడనే సమాచారం తన వద్ద ఉందని, జీవించి లేడనే మాట విన్నానని పేర్కొన్నారు. నాయకత్వం లేనప్పుడు యుద్ధాన్ని కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్య సంఘర్షణలో తక్షణ కాల్పుల విరమణ అంశాన్ని ఆయన కొట్టిపారేశారు.

Donald Trump Says He Hears the New Iranian Leader Mojtaba Khamenei Is Not Alive and ask Surrender

ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. టెహ్రాన్ ఘర్షణలను ముగించాలనుకున్నా, ప్రస్తుత నిబంధనలు తనకు సంతృప్తికరంగా లేవని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ఓ ఒప్పందం చేసుకోవాలనుకుంటోన్నప్పటికీ దానికి విధించిన నిబంధనలు సంతృప్తికరంగా లేవని, అందుకోసమే దీన్ని పక్కనపెట్టానని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు పటిష్టమైన ఒప్పందం అవసరమని సూచించారు.

శాంతి ఒప్పందానికి నిర్దిష్ట అవసరాలపై ప్రశ్నించినప్పుడు ట్రంప్ మౌనంగా ఉన్నారు. దీనికి సమాధానం ఇవ్వలేదు. ఆ విషయం బయటికి చెప్పదలుచుకోలేదని దాటవేశారు. అణ్వస్త్ర ఆశయాలను పూర్తిగా విడిచిపెట్టడానికి ఇరాన్ పూర్తి నిబద్ధత చూపడం ఇందులో ప్రాథమిక అంశం అవుతుందని ఆయన అంగీకరించారు.

మొజ్తబా ఖమేనీపైనా ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఖమేనీ జీవించి ఉన్నాడో లేదో తెలియదని, ఇప్పటి వరకు ఎవరూ అతన్ని చూపించలేదని వ్యాఖ్యానించారు. ఖమేనీ బతికిలేడనే మాట తాను వింటున్నానని, ఒకవేళ జీవించి ఉంటే, లొంగిపోవడం తెలివైన పని అని పేర్కొన్నారు. రాబోయే రెండ్రోజుల్లో మిగిలిన ఇరాన్ సైనిక సామర్థ్యాలన్నింటినీ కూడా పూర్తిగా తుడిచిపెడతామని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికా ఇప్పటికే ఇరాన్ క్షిపణులలో ఎక్కువ భాగాన్ని, మెజారిటీ డ్రోన్లను నాశనం చేశామని ట్రంప్ తెలిపారు. అలాగే ప్రపంచ చమురు ధరలను ఎదుర్కోవడానికి, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను సురక్షితం చేయడానికి అంతర్జాతీయ కూటమితో సమన్వయం చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ పై ఇరాన్ ఆధిపత్యాన్ని గూండాయిజంగా అభివర్ణించారు. దీనివల్ల ప్రభావితమైన అనేక దేశాలు ఈ జలమార్గంలో యుద్ధనౌకలను మోహరించాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+