ట్రంప్ ఆసక్తికరం: కిమ్‌తో ఫోన్‌లో చర్చలకు నేను రెఢీ, ఎలాంటి షరతులొద్దు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

కిమ్‌కు షాక్: ఉత్తరకొరియాపై యుద్దానికి అమెరికా రెఢీ: మైక్ ముల్లెన్ సంచలనం

అమెరికాతో పాటు దాని మిత్రదేశాలకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇటీవల కాలంలో చుక్కలు చూపిస్తున్నాడు. వరుస క్షిపణి పరీక్షలు, ఖండాంతర క్షిపణుల పరీక్షలతో ప్రపంచానికి కిమ్ జంగ్ ఉన్ సవాల్ విసిరాడు.

ట్రంప్‌కు కిమ్ షాక్: 'భయపెట్టినంత కాలం అణు కార్యక్రమాలు చేస్తాం'

కిమ్‌ను కట్టడి చేసేందుకు అమెరికా అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తోంది. అయితే ఇదే సమయంలో కిమ్ కూడ అమెరికాకు ధీటుగానే సమాధానం చెబుతున్నారు. తన టేబుల్‌పైనే అణ్వస్త్ర బటన్ ఉందని కిమ్ సంచలన ప్రకటన చేశారు

కిమ్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు సిద్దమే

కిమ్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు సిద్దమే

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్ జంగ్ ఉన్ తన టేబుల్‌పైనే న్యూక్లియర్ బటన్ ఉందని చేసిన ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే తన టేబుల్‌పై కూడ న్యూక్లియర్ బటన్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ ప్రకటించారు. అయితే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దక్షిణ కొరియాతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని కిమ్ చేసిన ప్రకటన కూడ చర్చకు తెరలేపింది. అయితే ఈ ప్రకటన తర్వాత కిమ్‌తో ఫోన్లో మాట్లాడేందుకు తాను కూడ సిద్దంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించడం విశేషం.

ఎలాంటి ఇబ్బందులు లేవు

ఎలాంటి ఇబ్బందులు లేవు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్ ఉన్‌తో చర్చలకు తాను ఫోన్‌లో మాట్లాడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్ ప్రకటించారు. అయితే ముందస్తుగా ఎలాంటి షరతులు ఉండకూడదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఆ రెండు దేశాల్లో సానుకూల వాతావరణం

ఆ రెండు దేశాల్లో సానుకూల వాతావరణం

ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య చర్చలు సాగితే ఆ రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.నూతన సంవత్సరం రోజున దక్షిణ కొరియాతో చర్చలకు తాను సిద్దంగా ఉన్నానని కిమ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై వెనుక తానే ఉన్నానని ట్రంప్ కూడ చెప్పుకోవడం గమనార్హం.

ప్రశాంతత నెలకొంటుందా

ప్రశాంతత నెలకొంటుందా

ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య చర్చలు జరిగితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సడలే అవకాశం ఉంటుంది. మరో వైపు అమెరికా కూడ ఉత్తరకొరియాతో చర్చలు జరిపితే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశాలు లేకపోలేదు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై కిమ్ ఎలా స్పందిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump said on Saturday he would "absolutely" be willing to talk on the phone to Kim Jong-un, the North Korean leader.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X