అధ్యక్షుడినైతే వారందరినీ ఉరి తీయించేస్తా.. ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో ఈ నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌లు ప్రచారంలో పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ యూఎస్‌లోని అక్రమ వలసదారులపై విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షడిగా ఎన్నికైతే దేశ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష విధిస్తానంటూ సంచలను కామెంట్స్ చేశారు. కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలను చేశారు.
అమెరికా విముక్తి దినోత్సవంగా..
దేశాన్ని ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ను ఆక్రమిత అమెరికాగా పిలుస్తున్నారని, దేశాన్ని నేరస్థులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరాను మొదలుపెడతానని చెప్పుకొచ్చారు. నవంబరు 5న అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుందని పేర్కొన్నారు. అమెరికన్ పౌరులను, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు ఉరిశిక్ష విధిస్తానను కామెంట్ చేశారు.

అరగువా సభ్యుల ఏరివేతపై..
ఆరోరాను వేధిస్తున్న వెనెజువెలా గ్యాంగ్ ట్రెన్ డె అరగువా సభ్యుల ఏరివేతపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అరోరా నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రతీ పట్టణాన్ని తాను రక్షిస్తానని, ప్రమాదకరమైన అలాంటి నేరస్థులను దేశం నుంచి తడిమికొడతామని చెప్పుకొచ్చారు. అలాగే, దక్షిణ సరిహద్దు నియంత్రణకు యూఎస్ ప్రభుత్వం మెక్సికోతో చాలా ఏళ్లుగా ఇబ్బందులను ఎదుర్కుంటోందని అన్నారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో వలసదారుల చొరబాట్లు విపరీతంగా పెరిగిపోయాయని, అన్ని సమస్యలను తాను అధ్యక్షడిగా గెలుపొందిన తర్వాత పరిష్కరిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications