7 కాదు 8..! భారత్ -పాక్ వార్ లెక్క మార్చిన ట్రంప్ ..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సాగిన యుద్ధాన్ని తానే విరమింపచేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. భారీ సుంకాలు, వాణిజ్య ఒప్పందాల కారణం చూపి వారి మధ్య కాల్పుల విరమణ చేయించినట్లు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. అలాగే భారత్-పాక్ యుద్దంలో ఇరువైపుల నుంచి ఆరు నుంచి 7 విమానాలు కుప్పకూలినట్లు కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ట్రంప్ ఆ సంఖ్యను 8కి పెంచేశారు.
గతంలో భారత్-పాక్ మధ్య సాగిన యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ తాజాగా మరోసారి చెప్పుకొచ్చారు. అలాగే ఆ యుద్దంలో కుప్పకూలిన విమానాల సంఖ్యను సవరించి 8 అని చెప్పేశారు. రెండు అణ్వాయుధ దేశాలు ఈ ఏడాది మే నెలలో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తామని బెదిరించిన తర్వాత మాత్రమే శాంతికి అంగీకరించాయన్నారు. నిన్న మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను భారత్, పాకిస్తాన్‌తో వాణిజ్య ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఆపై తాను ఒక వార్తాపత్రిక మొదటి పేజీలో చదివానని, వారు యుద్ధానికి వెళ్తున్నారని విన్నానని, ఇందులో ఏడు విమానాలు కూలిపోయాయని, మరొకటి తీవ్రంగా దెబ్బతిందన్నారు. చివరిగా ఎనిమిది విమానాలు కూలిపోయాయన్నారు. మీరు యుద్ధం వైపు వెళ్తున్నారు, మీరిద్దరూ అణ్వాయుధ దేశాలు, మీరు శాంతికి అంగీకరిస్తే తప్ప మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోనని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు.

అప్పుడు భారత్-పాక్ ఇద్దరూ తన వాదనకు అంగీకరించి వాణిజ్యానికీ, యుద్దానికీ సంబంధం లేదని తనకు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. మీరు పరస్పరం యుద్ధంలో ఉంటే మీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం లేదని చెప్పానన్నారు. మరుసటి రోజు రెండు దేశాలు శాంతి చేసుకున్నాయని తనకు ఫోన్ వచ్చిందని ట్రంప్ తెలిపారు. తాను అందుకు ధన్యవాదాలు తెలిపి, వాణిజ్యం చేద్దామని చెప్పానన్నారు. అయితే సుంకాలు లేకుందా మాత్రం కాదన్నారు.
-
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!!












Click it and Unblock the Notifications