వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టీఫెన్ ఉగ్రవాదో కాదో తెలియదు: తుపాకీ సంస్కృతిపై ట్రంప్ ఇలా..

అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన దాడిని ఇప్పటికే తీవ్రంగా ఖండించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హంతకుడు ఉగ్రవాదో కాదో తెలియదన్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన దాడిని ఇప్పటికే తీవ్రంగా ఖండించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హంతకుడు ఉగ్రవాదో కాదో తెలియదన్నారు. స్టీఫెన్‌ ప్యాడాక్‌ అనే దుండగుడు ఓ సంగీత కచేరీని లక్ష్యంగా చేసుకుని తూటాల వర్షం కురిపించాడు. అయితే దుండగుడు తమ 'సైనికుడే'నని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దాడి వెనుక ఐసిస్‌ పాత్రపై స్థానిక మీడియా ట్రంప్‌ను ప్రశ్నించగా.. దాని గురించి తనకు తెలియదని చెప్పారు. దుండగుడికి ఐసిస్‌తో సంబంధం ఉందో లేదో అన్న విషయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.

Donald Trump to visit Las Vegas to soothe people traumatized by mass shooting

అంతేగాక, అమెరికాలో తుపాకుల సంప్రదాయం గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని ట్రంప్‌ అన్నారు. లాస్‌వెగాస్‌ ఘటన నేపథ్యంలో దేశంలో తుపాకుల సంప్రదాయం, వాటి నియంత్రణపై చర్చ జరపాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా, లాస్‌వెగాస్‌ను ఆయన బుధవారం సందర్శించనున్నారు.

గత ఆదివారం లాస్‌వెగాస్‌లో ఓ సంగీత కచేరీలో పాల్గొన్న వందలాది మందిపై స్టీఫెన్‌ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 59 మంది చనిపోగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఘటన అనంతరం దుండగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, హంతకుడు స్టీఫెన్‌కు గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేకపోవడం గమనార్హం.

English summary
US President Donald Trump will visit Las Vegas on Wednesday to try to soothe a city shaken by the deadliest shooting spree in modern US history in a trip that will test his ability to console a grieving nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X