వీళ్లున్నారే..: బాగా తలంటిన డొనాల్డ్ ట్రంప్- మాట వినట్లేదనే ఫ్రస్ట్రేషన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన సొంతపార్టీకి చెందిన రిపబ్లికన్లకు కీలక పిలుపునిచ్చారు. సెనేట్ ఫిలిబస్టర్‌ను రద్దు చేయాలని సూచించారు. డెమొక్రాట్లకు అవకాశం వస్తే.. వారు ఖచ్చితంగా ఇదే పని చేస్తారని, తమ రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించుకోవడానికి దీన్ని రద్దు చేసి తీరుతారని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో రిపబ్లికన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. స్టుపిడ్.. అని సంబోధించారు. చేతకానివాళ్లుగా ఉండకూడదని చురకలు అంటించారు.
డెమొక్రాట్లు ఫిలిబస్టర్‌ను రద్దు చేసి, సుప్రీంకోర్టును తమకు అనుకూలంగా మలచుకుంటారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు కొత్త రాష్ట్రాలను తమకు ఆధీనంలో తెచ్చుకునే ప్రమాదం ఉందని, దీనివల్ల ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లు వారి పరం అవుతాయని అన్నారు. షుమర్ షట్‌డౌన్ ఉన్నప్పటికీ, డెమొక్రాట్లు అవకాశం దొరికిన వెంటనే ఫిలిబస్టర్‌ను రద్దు చేస్తారని పదేపదే ట్రంప్ హెచ్చరించారు. అందుకే చొరవ తీసుకుని రిపబ్లికన్లే దీన్ని రద్దు చేయాలని అన్నారు.

షట్ డౌన్ సమయంలో డెమోక్రాట్లకు అడ్డు చెప్పేవారు లేరని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. బలహీనంగా, అచేతనంగా, తెలివితక్కువగా ఉండకూడదని రిపబ్లికన్లకు సూచించారు. "పోరాడండి.. గెలవండి" అని ట్రంప్ ధైర్యాన్ని నూరిపోశారు. దీనికి సంబంధించిన సుదీర్ఘ పోస్ట్ ను ఆయన తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో పోస్ట్ చేశారు.
ఫిలిబస్టర్ అనేది ఓ సెనేట్ నియమం. ఇది చట్టాలను ఆమోదించడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఏదైనా చట్టాన్ని ఆమోదించాలంటే 60 ఓట్లు అవసరమౌతాయి. సెనేట్ లో రిపబ్లికన్లకు 53 సీట్లే ఉన్నాయి. అయినప్పటికీ- ఫిలిబస్టర్‌ను పూర్తిగా రద్దు చేసే విషయంలో ఈ 53 మంది అనుకూలంగా ఓటు వేస్తారా? లేదా అనేది అనుమానమే. పార్టీలో తగినంత మద్దతు ఉందో లేదో అస్పష్టం. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వారికి పిలుపునిచ్చారు.
చాలా కాలంగా ఇది రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. జో బైడెన్ హయాంలో కొంతమంది డెమొక్రటిక్ సెనేటర్లు ఓటింగ్, అబార్షన్ హక్కులను కాపాడటానికి ఈ నియమాన్ని మార్చాలని కోరారు. అప్పట్లో అది సాధ్యపడలేదు. ఆ ప్రతిపాదనలకు పార్టీలో పూర్తి మద్దతు లభించలేదు. ఇప్పుడు మళ్లీ ఇది తెరమీదికి వచ్చింది. ఫిలిబస్టర్ షట్‌డౌన్ కంటే తీవ్ర సమస్యగా భావిస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
ఇది- అమెరికా మనుగడకు అత్యవసరమని పేర్కొన్నారు. ఫిలిబస్టర్‌ను రద్దు చేయని రోజు రిపబ్లికన్లు పశ్చాత్తాప పడతారని వ్యాఖ్యానించారు. ధైర్యంగా ఉండాలని, తెలివిగా వ్యవహరించాలని, ఈ విషయంలో విజయం సాధించాలని అన్నారు. ఇది షట్‌డౌన్ కంటే చాలా పెద్దదని, దేశ మనుగడ దీనిపై ఆధారపడి ఉందని చెప్పారు. ట్రంప్ సెనేట్ రిపబ్లికన్లను "న్యూక్లియర్ ఆప్షన్"ను ఉపయోగించి ఫిలిబస్టర్‌ను రద్దు చేయాలని కోరారు.
-
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?











Click it and Unblock the Notifications