అలిగిన హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ రెమ్యునరేషన్ భారీగా పెంపు
ఐపీఎల్ లో ఓ కీలక ట్రేడింగ్ ముగిసింది. ముంబై ఇండియన్స్ కేప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పరస్పరం జట్లు మారడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. స్వాపింగ్ పద్ధతిన వీరిద్దరూ అటు ఇటు మారనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బీసీసీఐ ఆమోదముద్ర వేసింది. దీంతో ఐపీఎల్ ఓ అధికారిక ప్రకటన వెలువడించింది. వారి రెమ్యునరేషన్ వివరాలనూ వెల్లడించింది.
ఈ మార్పిడి ప్రక్రియలో హార్దిక్ పాండ్యా భారీగా లబ్దిపొందాడు గానీ, అర్ష్ దీప్ సింగ్ కు అదనంగా ఎలాంటి లాభం కలగలేదు. అర్ష్ దీప్ సింగ్ పాత కాంట్రాక్ట్ లీగ్ ఫీజు ప్రకారమే ముంబై ఇండియన్స్ లో జాయిన్ కానున్నాడు. హార్దిక్ పాండ్యా మాత్రం దీనికి భిన్నం. అతనికి రెండున్నర కోట్ల రూపాయల మొత్తం అదనంగా లభించింది. ఈ తాజా ఒప్పందం ప్రకారం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో తీసుకున్న 16.50 కోట్ల రూపాయలకు అదనపు మొత్తంలో పంజాబ్ కింగ్స్ జట్లులో చేరనున్నాడు. దీని విలువ 18 కోట్ల రూపాయలు.

2025 ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి అర్ష్‌దీప్ సింగ్ రూ. 18 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడదే మొత్తాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు చెల్లించనుంది. ముంబై ఇండియన్స్ లో తీసుకొన్న రెమ్యునరేషన్ కు అదనంగా రెండున్నర కోట్ల రూపాయలు అదనంగా వచ్చి చేరింది. ముంబై ఇండియన్స్ మాత్రం రూ. 18 కోట్లకే అర్ష్‌దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకుంది.
ఈ ప్రతిపాదిత ట్రేడ్ వల్ల రెండు ఫ్రాంచైజీల వ్యూహాత్మక సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రధానంగా డెత్ ఓవర్లలో వికెట్లు తీసే పదునైన భారతీయ పేసర్ అవసరం ఉండేది. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రాకతో ముంబై పేస్ విభాగం మరింత బలంగా మారనుంది. కొత్త బంతితో పాటు ఇన్నింగ్స్ ఆఖర్లల్లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అర్ష్‌దీప్ నైపుణ్యం ముంబైకి ప్లస్ పాయింట్ కానుంది.
హార్దిక్ పాండ్యా రూపంలో ఒక ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు లభించినట్టయింది.. ఈ డీల్ తో. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించడంతో పాటు సీమ్ బౌలింగ్ చేయగల హార్దిక్.. ఆ జట్టుకు ప్రధాన బలంగా మారనున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లకు నాయకత్వం వహించిన సుదీర్ఘ అనుభవం పంజాబ్ కెప్టెన్సీ ఎంపికకు కూడా ఉపయోగపడనుంది. శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో జట్టుకు కేప్టెన్సీ వహించవచ్చు.













Click it and Unblock the Notifications
