Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 మంది బాల నేరస్తులకు ఉరి శిక్ష

దుబాయ్: వివిధ నేరాలకు పాల్పడి అరెస్టు అయిన బాల నేరస్తులకు పదుల సంఖ్యలో ఇరాన్ లో ఉరి వేస్తున్నారని అమ్నెస్టి ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ) ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

ఉరి శిక్షకు గురైన జువెనైల్స్ త్వరలోనే పద్దెనిమిదేళ్లలోకి అడుగుపెడుతున్నారని ఆ సంస్థ చెప్పింది. గతంలో కూడ బాలనేరస్తుల మీద ఏమాత్రం జాలి చూపించకుండా మరణ శిక్ష అమలు చేసిందని ఆరోపించింది.

Dozens of juvenile offenders face death penalty in Iran

మంగళవారం అమ్నేస్టి సంస్థ దుబాయ్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. 2005 నుంచి 2015 మధ్యకాలంలో ఇరాన్ 73 మంది బాల నేరస్తులను ఉరి తీసిందని తమ వద్ద సమాచారం ఉందని ఆ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ పాశ్యాత్య దేశాలతో అణు ఒప్పందం చేసుకుంటున్న సమయంలో తాము ఈ విషయంపై ఇరాన్ మీద ఒత్తిడి తీసుకు వచ్చామని ఆ సంస్థ వివరించింది.

ఆ సందర్బంలో కొన్ని తీర్మానాలు ప్రతిపాదించగా వాటిని అంగీకరిస్తున్నట్లు నటించిన ఇరాన్ ఆ తీర్మానాలను నిర్లక్షం చేస్తూ మరో సారి 10 మందికి పైగా బాల నేరస్తులకు ఉరి శిక్ష అమలు చెయ్యడానికి సిద్దం అవుతున్నదని అమ్నేస్టి ఆరోపిస్తున్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+