తెగబడ్డ తాలిబన్స్: కాందహార్ స్థావరంపై దాడి.. 26మంది సైనికులు హతం..
దాడిలో 26మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి తెగబడ్డారు. కాందహార్ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంపై దాడి చేశారు. దాడిలో 26మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

తాలిబన్ల దాడిని ఆ దేశ రక్షణ శాఖ వ్యవహారాల ప్రతినిధి వాజిరీ ధ్రువీకరించారు. కాందహార్‌లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలోని సైనిక స్థావరంపై తాలిబన్లు గత రాత్రి దాడి చేసినట్లు ఆయన చెప్పారు. తాలిబన్ల దాడిని సైనిక దళాలు తీవ్రంగా ప్రతిఘటించాయని అన్నారు. సైనిక దళాల దాడిలో దాదాపు 80 మందికి పైగా తిరుగుబాటుదారులు హతమైనట్లు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications