వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: రన్ వేపైకి ఒకేసారి రెండు విమానాలు, తృటిలో తప్పిన పెను ప్రమాదం

|
Google Oneindia TeluguNews

దుబాయ్: దుబాయ్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రెండు ఎమిరేట్స్ విమానాల మధ్య భారీ ప్రమాదం తప్పిపోవడంతో ఆదివారం వందలాది మంది ప్రాణాలు నిలిచాయి. లేదంటే ఏడాది పెద్ద ప్రమాదం ఇదే అయి ఉండేది. దుబాయ్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

గత ఆదివారం దుబాయ్ ఎయిర్‌పోర్టులో భారతదేశానికి వచ్చే రెండు విమానాలు టేకాఫ్ సమయంలో ఒకే రన్ వేపైకి రావడంతో గమనార్హం. ఎమిరేట్స్ విమానాల షెడ్యూల్ ప్రకారం.. రెండు విమానాలు బయలుదేరే సమయాల మధ్య ఐదు నిమిషాల తేడా మాత్రమే ఉండటం ఈ పరిస్థితి దారితీసినట్లుగా తెలుస్తోంది.

Dubai airport: Two Flights To India Were On Runway Together, How Hundreds Were Saved.

ఈకే-524(దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చే విమానం), ఈకే-568(దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చే విమానం) ఈ రెండు విమానాలు ఐదు నిమిషాల వ్యవధిలో గమ్యస్థానం వైపు ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరుకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా, హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం వేగంగా రన్ వేపై దూసుకురావడం ప్రారంభించింది.

ఇటు నుంచి దూసుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన ఏటీసీ అధికారులు వెంటనే స్పందించారు. హైదరాబాద్‌కు వచ్చే విమానానికి టేకాఫ్ తిరస్కరించడంతో అది నెమ్మదిగా ముందుకు కదిలింది. అనంతరం బెంగళూరుకు వెళ్లాల్సిన విమానం బయలుదేరింది. ఇక ఈకే-524 విమానం ట్యాక్సీ బేకీ వెళ్లి.. కొన్ని నిమిషాల తర్వాత టేకాఫ్ అయ్యింది.

తీవ్రమైన భద్రతా లోపాన్ని బయటపెట్టిన ఈ ఘటనపై యూఏఈకి చెందిన విమానయాన దర్యాప్తు సంస్థ ఏఏఐఎస్(ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్) దర్యాప్తు ప్రారంభించింది. ఇక ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఈ ఘటనను ధృవీకరించింది.
ఈఘటనలో ఎటువంటి ఆస్థి ప్రాణ నష్టం వాటిల్లలేదని సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యంగా తమ సేవలు ఉంటాయని పునరుద్ఘాటించింది. అయితే ఘటన సమయంలో రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం తెలియరాలేదు.

English summary
Dubai airport: Two Flights To India Were On Runway Together, How Hundreds Were Saved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X