• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విమానాశ్రయంలో ప్రసవం: భారతీయ ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఇన్ స్పెక్టర్

|

దుబాయ్: అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రసవ వేదనకు గురై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ భారతీయ మహిళను, ఆమె బిడ్డను చివరి నిమిషంలో కాపాడారు ఓ దుబాయ్ ఇన్ స్పెక్టర్. దీనికోసం ఆమె తన విధులను కూడా పట్టించుకోలేదు. ఆసుపత్రికి తరలించడానికి ఏ మాత్రం వీల్లేని పరిస్థితికి చేరిన మహిళా ప్రయాణికురాలిని సంరక్షించారు. ఈ అరుదైన ఘటన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ మహిళ తన భర్తతో కలిసి దుబాయ్ లో నివసిస్తున్నారు. ఆమె నిండుచూలాలు. కాన్పు కోసం పుట్టింటికి రావాలని నిర్ణయించుకున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వదేశానికి బయలుదేరారు. విమానాశ్రయానికి చేరుకున్న కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. తీవ్రతరం అయ్యాయి. నిమిషాల వ్యవధిలో ఆమె- అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించడానికి కూడా వీల్లేని స్థితికి చేరుకున్నారు.

ఈస్టర్ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో ..450 మందికి గాయాలు

Dubai female inspector helps passenger deliver baby at airport

అదే సమయంలో హనన్ హసన్ మొహమ్మద్ అనే మహిళా ఇన్ స్పెక్టర్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నారు. దుబాయ్ ఎయిర్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారామె. భారతీయ మహిళా ప్రయాణికురాలి పరిస్థితిని గుర్తించిన వెంటనే- ఏ మాత్రం ఆలోచించలేదు. ఆమెను కాపాడటానికి కాస్సేపు తన విధులను పక్కన పెట్టారు. దగ్గరుండి భారతీయ ప్రయాణికురాలికి చికిత్స అందించారు. కార్డియోపల్మనరీ రిజాల్యూషన్ (సీపీఆర్) సహా, సాధారణ కాన్పు కావడానికి సహకరించారు. ప్రసవానంతరం చికిత్స కోసం ఆమెను స్థానిక లతీఫ్ ఆసుపత్రికి తరలించారు. విధులు ముగిసిన తరువాత కూడా హనన్.. ఆసుపత్రికి వెళ్లి ఆమెకు అండగా ఉన్నారు.

నిజానికి- ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురు కావచ్చనే ఉద్దేశంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు.. తమ సిబ్బందికి ప్రథమ చికిత్స అందించడంలో శిక్షణ ఇస్తుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, ఇక్కడికి చేరుకున్న తరువాత గుండెపోటుకు గురి కావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయనే ఉద్దేశంతో తమ సిబ్బందికి శిక్ణణ ఇస్తుంటామని డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అలీ అతిఫ్ బిన్ లహేజ్ తెలిపారు. అలాంటి శిక్షణే ఇప్పుడు ఓ భారతీయ మహిళా ప్రయాణికురాలిని కాపాడిందని ఆయన అన్నారు. హనన్ సేవలను గుర్తించిన ఆయన ఆమెకు రివార్డు ప్రకటించారు. ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Dubai International Airport female inspector recently saved an Indian woman who went into labour at the airport. According to Dubai police, the woman’s condition was such that she could not be transferred to any hospital at that stage, so Hanan Hussain Mohammad, inspector at the Directorate General of Airport Security, Terminal 2, decided to swing into action. Thanks to her presence of mind, she made the necessary arrangements in record time to enable the pregnant woman to successfully deliver the baby in the airport’s inspection room itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more