550 మందికి తండ్రైన వైద్యుడు.. కోర్టుకెక్కిన తల్లి, స్వచ్ఛంద సంస్థ..!
వీర్య దానం(sperm donor)తో నెదర్లాండ్స్ కు చెందిన ఓ వైద్యుడు ఏకంగా 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అతను ఇక నుంచి వీర్యం దానం చేయకుండా అడ్డుకోవాలని డోనార్‌కైండ్ ఫౌండేషన్ అనే డచ్ సంస్థ కోర్టులో దావా వేసింది. ఫౌండేషన్ తో పాటు మరో మహిళ కూడా కోర్టుకు వెళ్లింది. ది హెగ్ నివసించే 41 ఏళ్ల జోనాథన్ అనే వైద్యుడు నెదర్లాండ్స్ తో పాటు అంతర్జాతీయంగా 13 ఆస్పత్రుల్లో వీర్యం దానం చేశాడు.
తద్వారా 550 మంది పిల్లలకు పరోక్షంగా తండ్రయ్యాడు. కోర్టుల దావా వేసిన మహిళ కూడా జోనాథన్ వీర్యంతోనే బిడ్డకు జన్మనిచ్చింది. అతనికి ఎక్కువ మంది పిల్లలు పుట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు విధించాలని కోర్టును కోరింది. జోనాథన్ వీర్యదానం చేయడం ద్వారా 100 మంది పిల్లకు జన్మనిచ్చినట్లు తెలిసింది. అయినా అతనిపై నిషేధం విధించకపోవడంతో ఇప్పుడు ఆ సంఖ్య 550కి చేరింది.

నిబంధనల ప్రకారం స్పెర్మ్ డోనార్స్ 25 కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండకూడదు. లేదా 12 కంటే ఎక్కువ మంది తల్లులను గర్భం దాల్చకూడదు. 2017లో అతను 11 విభిన్న సంతానోత్పత్తి క్లినిక్‌లలో 102 మంది పిల్లలకు తండ్రయ్యాడని డచ్ సొసైటీ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ (NVOG) హెచ్చరించడంతో, జోనాథన్ ను నెదర్లాండ్స్‌లో బ్లాక్‌లిస్ట్ లో పెట్టారు. కానీ ఆ వ్యక్తి విదేశాలలో మరియు ఇంటర్నెట్ ద్వారా స్పెర్మ్ దానం చేయడం కొనసాగించాడు.
అతని చర్యలు చట్టవిరుద్ధమని డోనార్‌కైండ్ తరఫున వాదిస్తున్న న్యాయవాది మార్క్ డి హెక్ అన్నారు. "దాత పునరుత్పత్తి చేయాలనే అతని కోరికకు ప్రాధాన్యత ఇచ్చాడు. అతని ప్రవర్తన దాత పిల్లల మానసిక, శారీరక శ్రేయస్సుకు ముప్పు కలిగిస్తుంది" అని వాదించాడు.












Click it and Unblock the Notifications