జపాన్‌లో రెండు భారీ భూకంపాలు
దక్షిణ జపాన్‌లో మంగళవారం ఉదయం రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. మయాకో ద్వీపం సమీపంలోని జలాల్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులు ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు
టోక్యో: దక్షిణ జపాన్‌లో మంగళవారం ఉదయం రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. మయాకో ద్వీపం సమీపంలోని జలాల్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులు ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక పరిశోధనా కేంద్రం కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ భూకంపాలతో సముద్రమట్టాల్లో స్వల్ప తేడాలు వస్తాయి కానీ, సునామీ వచ్చే అవకాశం లేదని జపాన్ మెటిరోలాజికల్ అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో నాలుగు టెక్టానిక్ ప్లేట్లలో వచ్చే కదిలికల వల్ల ఏటా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతంలో జపాన్ దేశం ఉండటం గమనార్హం. కాగా, 2011లో సముద్ర గర్భంలో ఏర్పడిన భారీ ప్రకంపనల కారణంగా ఇక్కడ సునామీ ఏర్పడింది. ఈ విపత్తులో దాదాపు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications