ఇండోనేషియాలో అర్థరాత్రి భారీ భూకంపం: ఇళ్ల నుంచి బయటికి జనం పరుగులు
జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో గురువారం (నవంబర్ 11న) తెల్లవారుజామున 12.46 గంటలకు సంభవించిన భారీ భూకంపంతో బెంబేలెత్తిపోయారు.
ఇళ్లల్లో నిద్రపోతున్న ప్రజలంతా.. భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.1 గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇండోనేషియా కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలపింది.

ఇది సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్ధని వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ స్పష్టం చేసింది.
భూకంపం వల్ల ఆస్థి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. కాగా ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున 12.46 గంటలకు మరోసారి భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications