పాకిస్థాన్ కు భూకంపం షాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో శనివారం వేకువ జామున భూకంపం సంభవించింది. భూకంపం దెబ్బకు స్థానికులు హడలిపోయి ఇండ్ల నుండి బయటకు పరుగుతీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయ్యిందని స్థానిక మీడియా వెల్లడించింది.
శనివారం వేకువ జామున ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్, పెషావర్ తో సహ పలు చోట్ల పర్వత ప్రాంతాలలో భూమి కంపించింది. విషయం తెలుసుకున్న అధికారులు ముందు జాగ్రత చర్యగా పలు చోట్ల నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.

ఇస్లామాబాద్ ఈశాన్యంలోని 15 కిలో మీటర్ల దూరంలోని మర్గల్లా పర్వతాల్లో 26 కిలో మీటర్ల కింద భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూఎస్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించిందని మీడియా తెలిపింది.
శనివారం వేకువ జామున సంభవించిన భూకంపం వలన ఎలాంట ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. నాసిరకంగా నిర్మించిన కట్టడాలలో నివాసం ఉంటున్న వారు ఆందోళనతో చెట్ల కింద కాలం గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications