వణికించిన పెను భూకంపం: సునామీ భయాలు..!!
అక్లాండ్: మరో పెను భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ ను వణికించింది. సునామీ భయాలను పుట్టించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.3గా రికార్డయింది. న్యూజిలాండ్ ఈశాన్య ప్రాంతంలోని కెర్మాడెక్ ఐలండ్‌ను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. కెర్మాడెక్‌కు ఈశాన్య దిశగా 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.
ఈ భూకంప తీవ్రత అటు ఆస్ట్రేలియాలోనూ కనపించింది. ఆస్ట్రేలియా ఈశాన్యంలో తీర ప్రాంతాల్లో అలలు పోటెత్తాయి. తక్షణమే తీర ప్రాంతాలను ఖాళీ చేయాాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కెర్మాడెక్ ఐలండ్‌లో భూకంపం సంభవించిన వెంటనే న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది.

న్యూజిలాండ్ తీర ప్రాంత నగరం అక్లాండ్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ కెర్మాడెక్ ఐలండ్. భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 6:11 నిమిషాలకు భూకంపం సంభవించిందక్కడ. కెర్మాడెక్ ఐలండ్‌ను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే న్యూజిలాండ్ తీరంలో అలలు పోటెత్తాయి. ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
ద్వీపం కావడం వల్ల సునామీ ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. సముద్ర తీరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉండే ప్రాంతాల్లో ఎమర్జెన్సీని విధించింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సూచించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా దాని తీవ్రత కొనసాగింది. వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి..
There is no tsunami threat to New Zealand following the M7.1 Kermadec Islands earthquake. Based on current information, the initial assessment is that the earthquake is unlikely to have caused a tsunami that will pose a threat to New Zealand.
— National Emergency Management Agency (@NZcivildefence) April 24, 2023
గతంలో కూడా అక్లాండ్ తీరాన్ని పెను భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ఏర్పడిన అప్పటి భూకంపం వల్ల తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. అవే తరహా పరిస్థితులు ఇప్పుడు కూడా నెలకొన్నాయి. తీర ప్రాంతాలన్నింటినీ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఖాళీ చేయిస్తోంది. ప్రాణ నష్టాన్ని నివారించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications