వణుకు పుట్టిస్తున్న వరుస భూకంపాలు.. ఈసారి జపాన్ లో..!

భూ కంపాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మయన్మార్‌, థాయ్‌లాండ్‌లలో ఇటీవల 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించి వేలాది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత టాంగో ఐల్యాండ్ లో భూకంపం సంభవించింది. ఇప్పుడు తాజాగా జపాన్‌ లోని క్యుషులో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.34 గంటలకు ప్రకంపనలు రాగా.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదైంది.

జపాన్ లో భూకంపాలు, సునామీలు సాధారణంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ అనూహ్య ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ భూకంపం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని వెల్లడించారు.

earthquakes-are-causing-tremors-this-time-in-japan-with-6-0-magnitude

ఇక ఇటీవలే పసిఫిక్ తీరంలో మెగా భూకంపం సంభవిస్తే... దేశం భారీగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని జపాన్ ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. ఇక సునామీలు సంభవిస్తే వందలాది భవనాలు కూలిపోయే అవకాశం ఉందని.. 1.81 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిళ్లవచ్చని అందులో పేర్కొంది. 3 లక్షల వరకు ప్రాణ నష్టం జరిగే ఛాన్సుందని నివేదికలో స్పష్టం చేసింది. లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. రిపోర్టు వెలువడిన కొద్ది రోజుల్లోనే భూకంపం చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఎంత మేర నష్టం జరిగిందో అని చర్చ జరుగుతోంది.

మయన్మార్‌లో భూకంప ధాటికి మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు పెద్దఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేదని సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలానే థాయ్‌లాండ్‌ లోనూ 17 మంది మరణించగా.. 32 మంది గాయాలపాలయ్యారు. అయితే భారీ అంతస్తు కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+