కాంగోని కలవరపెడుతున్న "ఎబోలా".. 101 మంది మృతి !!
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే 101 మంది మరణించడంతో అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది. తాజా పరిస్థితులపై కాంగో ఆరోగ్య అధికారులు నివేదికను విడుదల చేశారు. దాదాపు 550కి పైగా కేసులు నిర్ధారణ కాగా, 19 మంది కోలుకున్నారు. 309 మంది అనుమానితులు ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇటురి, నార్త్ కిపు ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా ఉంది. ఒక్క ఆదివారమే 35 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయం. వ్యాధి నిర్ధారణలో జాప్యం, సరైన టీకా, చికిత్స అందుబాటులో లేకపోవడం పెద్ద సవాలుగా మారాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో వైరస్ ఉధృతి తగ్గుతుందని భావిస్తున్నా, ప్రస్తుత గణాంకాలు ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. వ్యాధి ప్రాంతీయంగా విస్తరించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఇక కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో కూడా ఎబోలా ప్రభావం మొదలైంది. అక్కడ 19 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించినట్లు సమాచారం. పరిస్థితిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications