సౌదీలో భారీ అగ్నిప్రమాదం...11 మంది వలస కార్మికులు ఆహుతి
సౌదీ అరేబియాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నజ్రాన్ ప్రావిన్స్‌లోని ఓ పాత భవనంలో మంటలు చెలరేగి 11 మంది వలస కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతులంతా భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన వలస కార్మికులే
రియాద్: సౌదీ అరేబియాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నజ్రాన్ ప్రావిన్స్‌లోని ఓ పాత భవనంలో మంటలు చెలరేగి 11 మంది వలస కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు.
మృతులంతా భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన వలస కార్మికులే. కిటికీలు కూడా లేని ఆ భవనంలో వీరంతా తలదాచుకుంటున్నారని, ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయని, పొగతో ఊపిరాడక వారంతా మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు.

ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
రియాద్‌లో 90 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో ఎక్కువ మంది దక్షిణాయాసియా నుంచి వచ్చిన వారేనని 2015లో విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications