• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ కొత్త పాలసీ వచ్చేసింది: అలాంటి పోస్టులు పెడితే మీ అకౌంట్ గోవిందా..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌.. అల్లకల్లోలానికి గురవుతోంది. అతలాకుతలమౌతోంది. ఇన్ని సంవత్సరాల పాటు సజావుగా సాగుతూ వచ్చిన ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కుదుపులకు లోనవుతోంది. రోజూ పెను సంచలనాలు నమోదవుతున్నాయి ఇందులో. ఒక దాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.

తీవ్ర వ్యతిరేకత..

తీవ్ర వ్యతిరేకత..

ట్విట్టర్‌లో పని చేసే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు ఎలాన్ మస్క్. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ పట్టించుకోవట్లేదు. ఉద్యోగాల్లో కోత పెట్టారు. కొత్త ఉద్యోగాల నియామకాలను నిలిపివేశారు. టెక్నికల్, సేల్స్, ప్రొడక్ట్స్, అడ్వర్టయిజ్‌మెంట్, లీగల్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కుదించాలంటూ ఆయా విభాగాల మేనేజర్లందరికీ మెయిల్ పంపించారు. ఈ నెల 1వ తేదీ నుంచే ఉద్యోగులను తొలగించేలా ఎలాన్ మస్క్ చర్యలు తీసుకున్నారు.

కార్యాలయాలు క్లోజ్..

కార్యాలయాలు క్లోజ్..

ట్విట్టర్‌ అధినేతగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ ఉద్యోగుల తొలగింపుపైనే తన పూర్తి దృష్టిని కేంద్రీకరించారు ఎలాన్ మస్క్. దీన్ని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రారంభం నుంచీ ట్విట్టర్‌లో పని చేస్తోన్న వేలాదిమంది ఉద్యోగులు బయటికెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు మూడువేల మందికి పైగా ఉద్యోగులను తొలగించారాయన.

అక్కడి పని వాతావరణం, ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా పెట్టి వెళ్లినపోయిన వారూ చాలామందే ఉన్నారు. దీన్ని నిరసిస్తూ ట్విట్టర్ ఉద్యోగులు సామూహిక రాజీనామాలకు దిగారు. దీని దెబ్బకు భారత్ సహా పలు దేశాల్లో ట్విట్టర్ ఆఫీసులు మూత పడ్డాయి. ఎల్లుండి వాటిని పునరుద్ధరించనున్నట్లు తెలిపింది యాజమాన్యం.

కొత్త పాలసీ..

కొత్త పాలసీ..

తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ- ఎలాన్ మస్క్‌లో తన దూకుడును కొనసాగిస్తోనే వస్తోన్నారు. ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. ట్విట్టర్ వినియోగదారులకు వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఎలాంటి పోస్టులనైనా పెట్టొచ్చని పేర్కొన్న ఆయన నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండబోదని తేల్చి చెప్పారు. నెగెటివిటీ/హేట్ స్పీచ్ వంటి పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయబోమని స్పష్టం చేశారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని చెప్పారు.

అలాంటి పోస్టులు డీమోనిటైజ్డ్..

నెగెటివ్/హేట్‌ను ఈ ట్విట్టర్ వేదిక ద్వారా వ్యాపింపజేయాలనుకుంటే ఇకపై కుదరదని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. వాటిని బూస్టప్ చేయబోమని, మోనిటైజ్ పరిధిలోకి తీసుకుని రాబోమని అన్నారు. అలాంటి పోస్టులపై యూజర్లకు ఎలాంటి రెవెన్యూ ఉండబోదని తేల్చారు. అడ్వర్టయిజ్‌మెంట్లను కూడా నియంత్రిస్తామని పేర్కొన్నారు. యూజర్లు పోస్ట్ చేసిన నెగెటివ్/హేట్ స్పీచ్‌కు సంబంధించిన ట్వీట్లు ప్రత్యేకంగా ఇంటర్నెట్‌లో వెదికితే తప్ప అవి కనిపించబోవని చురకలు అంటించారు. అలాంటి వాటిని వ్యక్తిగత ట్వీట్లకు మాత్రమే పరిమితం చేసినట్లు వివరించారు.

డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ అకౌంట్‌పై..

డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ అకౌంట్‌పై..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను పాత యాజమాన్యం శాశ్వతంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించారు ఎలాన్ మస్క్. దీనికోసం ఓటింగ్ పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై ట్విట్టర్ యూజర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోన్నారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోల్ పోస్ట్‌ను పెట్టారు ఎలాన్ మస్క్.

వారి అకౌంట్స్ పునరుద్ధరణ

వారి అకౌంట్స్ పునరుద్ధరణ

పెట్టిన అరగంటకే 12,64,469 మంది యూజర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 24 గంటల పాటు ఉంటుందీ ఆన్‌లైన్ ఓటింగ్. కాగా- గతంలో వేటు పడిన క్యాథే గ్రిఫిన్, జోర్డాన్ పీటర్సన్, బాబిలోన్ బీ అకౌంట్లను పునరుద్ధరించినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, యూజర్ల అభిప్రాయాలను సేకరిస్తోన్నామని అన్నారు. మెజారిటీ యూజర్ల అభిప్రాయాల మేరకు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

English summary
Elon Musk announced new Twitter policy. In a tweet, he said that New Twitter policy is freedom of speech, but not freedom of reach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X