ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ లు..'గ్రోక్' బ్యాన్..'ఎక్స్' సీఈఓ రాజీనామా..

ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ లు తగిలాయి. ఎలాన్‌ మస్క్‌ కంపెనీ ఎక్స్‌ ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ ను నిషేధిస్తూ టర్కీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. టర్కి దేశాధినేతలపై గ్రోక్ చాట్ బాట్ అసభ్య కరమైన, అవమాన కరమైన వ్యాఖ్యలు చేసినట్లు టర్కిష్ కోర్టు పేర్కొంది. ఈ మేరకు దేశంలో గ్రోక్ ఏఐ చాట్ బాట్ ను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Elon Musk Faces Double Blow Grok Banned in Turkey Linda Yaccarino Resigns as X CEO

టర్కీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ చాట్ బాట్ గ్రోక్‌ ను నిషేధిస్తూ టర్కీ కోర్టు బాంబ్ పేల్చింది. సామాజిక మాధ్యమమైన ఎక్స్‌ లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా అధ్యక్షుడు ఎర్డోగన్‌, టర్కీ వ్యవస్థాపకుడు ముస్తఫా కెమాల్‌ అటాటర్క్‌ పైన గ్రోక్‌ అభ్యంతరకరమైన సమాధానాలు ఇచ్చినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి టర్కీ ఉన్నత న్యాయస్థానం ఈ విధానాన్ని దేశానికి ముప్పుగా పేర్కొంటూ గ్రోక్‌ను నిషేధించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ సీఈఓ లిండా యాకరినో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా ఆమె వెల్లడించారు. అయితే ఆమె నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ స్వాగతించారు. మీ సేవలకు ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు. ఎక్స్‌ సీఈవోగా లిండా 2023మే నుంచి రెండేళ్ల పాటు పనిచేశారు. మరి ఆమె రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+