ట్రంప్ ను నమ్మి $445 మిలియన్లు పోగొట్టుకున్న మస్క్..! బోనస్ గా టెస్లా, స్పేస్ ఎక్స్ పై విచారణ..!
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, రిపబ్లికన్ పార్టీయే కాదు, వారిని నమ్ముకున్న చాలా మందిని దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఎలాగైనా రిపబ్లికన్లను గెలిపిస్తారని, ఆయన గెలిస్తే అమెరికాలో మన హవా కొనసాగుతుందని భావించిన చాలా మందికి షాకులు తగిగాయి. ఇందులో అగ్రస్థానంలో ట్రంప్ ఫ్రెండ్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఉన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల గెలుపు కోసం ఆయన ఏకంగా 445 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 41 వేల కోట్లకు సమానం. ఇంత ఖర్చుపెట్టీ రిపబ్లికన్లు ఓడిపోవడంతో ఆయన లబోదిబోమంటున్నాడు.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్లకు అండగా నిలిస్తే, తిరిగి వారు గెలిచాక తన వ్యాపారాలకు ఎలాంటి అడ్డంకి ఉండదని భావించిన ఎలాన్ మస్క్.. అభ్యర్దుల కోసం, వారి ప్రచారాల కోసం భారీగా ఖర్చుపెట్టేశారు. అయితే రిపబ్లికన్లు చిత్తుగా ఓడిపోయి, డెమోక్రాట్లు యూఎస్ కాంగ్రెస్ లోని రెండు సభలు హౌస్, సెనేట్ పై పట్టు సాధించడంతో ఎలాన్ మస్క్ కు రెండు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. రిపబ్లికన్ల కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బు పోగా.. ఇప్పుడు డెమోక్రాట్లు తన సంస్థలైన స్పేస్ ఎక్స్, టెస్లాపై విచారణలు జరిపించేందుకు సిద్దమవుతున్నారు.

గతంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడంలో అన్నివిధాలుగా కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ .. ఆ తర్వాత తన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కార్యకలాపాలు, నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు వంటి అంశాలపై ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్ధితి ఉంది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వంతో మస్క్ వ్యాపార సంబంధాలపై డెమోక్రాట్లు సీరియస్ గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతో ఫలితాలు చూసిన మస్క్.. ఈసారి ఎన్నికల్లో తన స్పేస్ లేజర్లు పనిచేయలేదంటూ సెటైర్లు వేయడం ప్రారంభించారు. అంతే కాదు గతంలో తాను పెట్టిన పోస్టులన్నింటినీ తొలగించే పనిలో కూడా ఉన్నారు. ఇందులో రిపబ్లికన్లకు ఓటేయాలంటూ అక్టోబర్ 29న తాను పెట్టిన పోస్టు కూడా ఉంది. మరోవైపు రిపబ్లికన్ల ఓటమితో అమెరికా స్టాక్ మార్కెట్లలో పతనమైన షేర్ల కారణంగా మస్క్ కు భారీ నష్టం వాటిల్తుతోంది. దీంతో స్పేస్ ఎక్స్,టెస్లా తమ మార్కెట్ విలువను తలో 40 బిలియన్ డాలర్లు కోల్పోయి వరుసగా 1.83 ట్రిలియన్ డాలర్లకు, 865.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.














Click it and Unblock the Notifications
