Emirates Passengers Flight: గాల్లో ఎగురుతుండా విమానానికి రంధ్రం.. పైలట్లు ఏం చేశారంటే..
ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ380 విమానం.. దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు బయల్దేరింది. దాదాపు 14 గంటల ప్రయాణం అనంతరం పైలట్లకు ఏదో అనుమానం వచ్చింది. దీంతో అక్కడి ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)ను సంప్రదించారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి తీసుకున్నారు. సురక్షితంగా ల్యాండ్ అయ్యాక.. విమానం ఎడమ రెక్క వైపు కింది భాగంలో చూశారు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఎడమ రెక్క కింది భాగంలో రంధ్రాన్ని గుర్తించారు. అయితే
గాల్లో ప్రయాణిస్తున్న విమానానికి రంధ్రం పడినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జులై 1న జరిగింది. విమానం ఇంకా బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉందని ఎమిరేట్స్ ప్రతినిధి చెప్పారు. అధికారులు తనిఖీ చేశారని.. విమానం లోపలి భాగం, ఫ్యూజ్‌లేజ్, ఫ్రేమ్, నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. విమానం 22 టైర్లలో ఒకటి క్రూయిజ్ సమయంలో పగిలిందన్నారు. ఇది ఏరోడైనమిక్ ఫెయిరింగ్ చిన్న భాగానికి నష్టం కలిగించింది, ఇది బయటి ప్యానెల్ లేయర్ అని ఎయిర్‌లైన్ తెలిపింది.

ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం లేదు. టేకాఫ్ సమయంలో లేదా కొద్దిసేపటికే ఈ ఘటన జరిగి ఉండవచ్చని కొందరు ప్రయాణికులు ఓ స్థానిక వార్తాసంస్థకు చెప్పారు. ఆ సమయంలో విమానంలో పెద్ద శబ్దం వినిపించిందని, దాదాపు 45 నిమిషాలపాటు అది కొనసాగిందని వివరించారు. అయితే, క్యాబిన్ సిబ్బంది ప్రశాంతంగా ఉన్నారని.. రెక్కలు, ఇంజిన్‌లను తనిఖీ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications