సంచలనం: మరో వారంలో భూమి అంతం.. ప్రారంభం!?
మరో వారం రోజుల్లో భూమి అంతం ప్రారంభం కాబోతోందట. ఈ మధ్యన ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఉపద్రవం కనిపిస్తోంది గమనించారా? ఇవన్నీ దేనికి సూచనలు అనుకుటున్నారు? భూమి అంతానికే!
వాషింగ్టన్: మరో వారం రోజుల్లో భూమి అంతం ప్రారంభం కాబోతోందట. అదేమిటి? సెప్టెంబరు 23న ప్రపంచం అంతం కానుందని ఆ మధ్యన గగ్గోలు పెట్టారుగా.. ఏమైంది? ఏం జరిగింది? అంటారా... అదిగో అక్కడికే వస్తున్నాం.
ఈ మధ్యన ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఉపద్రవం కనిపిస్తోంది గమనించారా? అమెరికాలో ఏదో అగ్నిపర్వతం పేలి లావా ఎగజిమ్ముతోంది. కరీబియన్ దీవుల్లో హరికేస్లు విలయ తాండవం చేశాయి. ఇవన్నీ దేనికి సూచనలు అనుకుటున్నారు? భూమి అంతానికే!

ఇది మేం చెబుతున్నది కాదులెండి. డేవిడ్ మీడ్ అని ఓ కాలజ్ఞాని చెబుతున్న మాటలివి. నిబిరు అనే గ్రహం ఒకటి భూమివైపు దూసుకొస్తోందని, అది భూమిని ఢీకొడితే భూమి అంతమైపోతుందని ఆ మధ్యన ఆయనే చెప్పాడు.
ఈ డూమ్స్ డే సిద్ధాంతకారుడు ప్రపంచం అంతానికి ఇప్పుడో కొత్త తేదీ ఇచ్చాడు. ఆయన లెక్క ప్రకారం ఈనెల 15 వ తేదీ నుంచి భూమి అంతం ప్రారంభం కానుందట. అప్పట్నించి ఏడేళ్ల వ్యవధిలో భూమి అంతమైపోతుందట.
మెక్సికోలో వచ్చిన భూకంపం, టెక్సాస్ లో వరదలు, కరీబియన్ దీవులు, ఫ్లోరిడాలో వచ్చిన హరికేన్లు ఇందుకు నిదర్శనమని చెబుతున్నాడు డేవిడ్ మీడ్ . ఏమిటో.. ఇలా ఇదిగో, అదిగో అంటూ భయపడి చచ్చే బదులు.. పాడులోకం అంతమైపోతే పీడా వదులుతుందని విసుగెత్తిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications