• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్ర‌పంచానికి కరెంటు క‌ష్టాలు.. భయటపడటం ఎలా..?

|

యూర‌ప్ దేశాలు స‌హా ప్ర‌పంచ దేశాల్లో ఇప్ప‌టికే విద్యుత్ సంక్షోభం కొన‌సాగుతుంది. త‌త్ఫలితంగా మున్ముందు పాలు పిత‌క‌డానికి కూడా ఇబ్బందులు ఎదుర‌వుతాయా? అన్న సందేహాలు వ‌స్తున్నాయి.. గోవులు.. గేదెల‌ నుంచి పాలు పితికే యంత్రాలు మొద‌లు.. బొమ్మ‌ల త‌యారీ వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ప్ల‌య్ చైన్‌పై భారీ స్థాయిలో ప్ర‌భావం ప‌డుతుంద‌ని చైనా భావిస్తోంది. బొగ్గు, విద్యుత్ కొర‌త‌తో చైనాలోని కొన్ని రాష్ట్రాలు.. విద్యుత్ వినియోగాన్ని త‌గ్గించ‌డానికి త‌మ ఫ్యాక్ట‌రీల‌ను మూసేశాయి. విద్యుత్ కొర‌త వ‌ల్ల పంట‌ల నూర్పిడికి స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌ని డ్రాగ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం.

గృహోప‌క‌ర‌ణాలు, ఆటోమొబైల్స్‌లో వాడే ప్యాకేజింగ్ సెమీ కండ‌క్ట‌ర్లు, గాడ్జెట్స్ ప్రొడ‌క్ట్ బేస్‌గా చైనా ఉంది. ఇప్ప‌టికే ఆటోమొబైల్ రంగాన్ని సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త దెబ్బ తీస్తుంది. తాజాగా చైనాలో విద్యుత్ కొర‌త వ‌ల్ల ట‌యోటా కార్ల త‌యారీ సంస్థలో కార్ల ఉత్ప‌త్తి కొంత త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు యూర‌ప్‌లో స‌హ‌జ‌వాయువు ధ‌ర‌లు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. స‌హ‌జ‌వాయువు ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో యూర‌ప్ దేశాల్లోని ర‌సాయన ఎరువుల త‌యారీ సంస్థ‌లు ఉత్ప‌త్తి త‌గ్గించుకుంటున్నాయి. ఈ ప‌రిణామం అంత‌ర్జాతీయంగా ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

 energy crisis could very soon hit global markets

లిక్విఫైడ్ నాచుర‌ల్ గ్యాస్ దిగుమ‌తి కోసం ఆసియాదేశాలు రికార్డు స్థాయిలో డ‌బ్బు చెల్లించాల్సి వ‌స్తోంది. పాకిస్థాన్‌లో ఇది రాజ‌కీయ టెన్ష‌న్ల‌కు దారి తీసింది. ప్ర‌భుత్వ యాజ‌మాన్యం ఆధ్వ‌ర్యంలో లిక్విఫైడ్ గ్యాస్ కొనుగోళ్ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని పాక్ విప‌క్ష నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. యూర‌ప్‌లో నాచుర‌ల్ గ్యాస్ కొర‌త వెంటాడుతుండ‌గా, ఆసియా దేశాల నుంచి బొగ్గు స‌ర‌ఫ‌రా ప‌రిమితంగా సాగుతోంది. గ‌తేడాదితో పోలిస్తే యూర‌ప్ దేశాల్లో స‌హ‌జ‌వాయువు ధ‌ర‌లు 500 రెట్ల‌కు పైగా పెరిగిపోయాయి. సెప్టెంబ‌ర్ నుంచి 130 శాతం ఎక్కువ ధ‌ర‌కు స‌హ‌జ వాయువు కొనాల్సిన దుస్థితి నెల‌కొంది. అమెరికాలో సైతం గ‌త 13 ఏండ్ల‌లో తొలిసారి నాచుర‌ల్ గ్యాస్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.

సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న ఉత్ప‌త్తి నెమ్మ‌దించింది. బొగ్గు స‌ప్ల‌య్ కోసం యూర‌ప్ దేశాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా చైనా, ఇండోనేషియా బొగ్గు స‌ర‌ఫ‌రా చేయ‌లేక చ‌తికిల ప‌డుతున్నాయి. ఆస్ట్రేలియా న్యూ క్యాస్టిల్ థ‌ర్మ‌ల్ కోల్ మెట్రిక్ ట‌న్ను ధ‌ర 202 డాల‌ర్లు. 2019 చివ‌రిలో ధ‌ర‌తో పోలిస్తే మూడు రెట్లు ఇది ఎక్కువ‌. ఇక లెబ‌నాన్‌లో బొగ్గు కొర‌త‌తో దేశంలోని రెండు అతిపెద్ద ప‌వ‌ర్ స్టేష‌న్లు మూత ప‌డ్డాయి. శ‌నివారం లెబ‌నాన్ ప‌వ‌ర్ నెట్‌వ‌ర్క్ పూర్తిగా నిలిపేస్తున్నారు. వ‌చ్చే కొన్ని రోజులు అవి మూత‌పడి ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

English summary
energy crisis could very soon hit global markets. experts say to us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X