వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెగ్జిట్ ఎఫెక్ట్, రాజకీయాల్లో కుదుపు: కామెరూన్ రాజీనామా!

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బ్రెగ్జిట్ ఫలితం పైన ఆయన శుక్రవారం నాడు మాట్లాడారు. అక్టోబర్ నాటికి దేశానికి కొత్త ప్రధానమంత్రి వస్తారని చెప్పారు.

తాను ఆ నాటికి ప్రధానిగా తప్పుకుంటానని ప్రకటించారు. తాను ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. దేశానికి ఇక కొత్త నాయకత్వం అవసరమని చెప్పారు. తాజా పరిణామాలతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటన్ ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయన్నారు. యూరోపియన్ యూనియన్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు.

david

కామెరూన్ మాటలు వినని బ్రిటన్ పౌరులు

బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కామెరూన్ పౌరులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రజలు మాత్రం అందుకు విరుద్ధంగా తీర్పు చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్లేందుకు వారు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో షాక్‌కు గురైన ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పవచ్చు.

జర్మనీ, ఫ్రాన్స్‌లో గుబులు

బ్రెగ్జిట్ తీర్పు యూనియన్‌లోని రెండు ప్రధాన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ ల్లో కొత్త గుబులును రేపిందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ రెండు దేశాల్లో సాధారణ ఎన్నికలు 2017లో జరగనున్నాయి. బ్రిటన్ యూనియన్ నుంచి తప్పుకుంటున్న సమయంలో.. ప్రధాన దేశాలుగా ఉన్న మనం కూడా వెళ్లిపోదామని అటు జర్మనీలో, ఇటు ఫ్రాన్స్‌లో ప్రజల సెంటిమెంట్‌ను విపక్షాలు పెంచి అధికారానికి దగ్గర కావాలని చూస్తాయని అంటున్నారు.

అటు బెర్లిన్‌లో, ఇటు పారిస్‌లో ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఆ దేశాల్లోని టెలివిజన్ చానల్స్ ఈ విషయంలో ప్రత్యేక చర్చలు జరిపాయి. వాస్తవానికి యూనియన్‌లో 28 సభ్య దేశాలుండగా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల వాటా 25 శాతం వరకూ ఉంది.

బ్రిటన్ వీడితే ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయడం అంత సులువేమీ కాదు. అదే సమయంలో ఫ్రాన్స్, జర్మనీలు సైతం అదే దారిలో పయనిస్తే, యూఈ కుప్పకూలడం ఖాయమంటున్నారు. ఎందుకంటే యూనియన్ ‌లోని గ్రీస్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటులో ఉండి ఇతర దేశాల సాయంపై ఆధారపడి బతుకుతుండగా.. ఇటలీ, డెన్మార్క్ తదితర దేశాలు సైతం బ్రిటన్ దారిలో వెళ్లాలని ఇప్పటికే ఆలోచిస్తున్నాయి.

English summary
David Cameron resigns as UK shocks the world by voting for Brexit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X