వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెనుప్రమాదం:ఓరోవిల్లె డ్యామ్ స్పిల్ వే కు రంధ్రం, ఎన్ ఆర్ ఐ లను తరలింపు

అమెరికాలోని ఓరోవిల్లె డ్యాం ఏ క్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ మేరకు పరిసర ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:అమెరికాలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఓరోవిల్లె పరిసరప్రాంతాలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎన్ ఆర్ ఐ లు ఉంటారు.ఓరోవిల్లె డ్యాం ఎమర్జెన్సీ స్పిల్ వే వద్ద రంద్రం కన్పించడంతో డ్యాం ఏ క్షణంలో కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఓరోవిల్లె డ్యాం స్పిల్ వే కు రంద్రం పడింది.అయితే ఈ ప్రమాదం కారణంగా డ్యామ్ ఏ క్షణాన కూలిపోతోందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఎన్ ఆర్ ఐ లు నివసిస్తుంటారు. ఇక్కడ ఉన్న జనాభాలో 13 శాతం మంది సిక్కులేనని సమాచారం.

Evacuations ordered below Oroville Dam after a hole is found in its emergency spillway

ఈ డ్యామ్ కూలిపోతే ఈ ప్రాంతమంతా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది.స్పిల్ వే కు పడిన రంద్రాన్ని మూసివేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఓరోవిల్లే డ్యాం ఆగ్జిలరీ స్పిల్ వేకు రంధ్రం పడిందని దాని వల్లె ఓరోవిల్లె డ్యామ్ ఆగ్జిలరీ స్పిల్ వేకు రంద్రం పడిందని ,దాని వల్ల ఓరోవిల్లె చెరువు నుండి భారీ మొత్తంలో వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

డ్యామ్ ఎప్పుడు కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటుందో తెలియదని అధికారులు చెబుతున్నారు.ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఓరోవిల్లె నగరంలో సుమారు 16 వేల మంది జనాభా ఉంటారు.

ఇక్కడ నివసిస్తున్న వారిని చికో నగరం వైపుకు వెళ్ళాలని సూచించారు అధికారులు. యుబా కౌంటీకి కూడ ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కూడ ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మంచు కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న నీటితో డ్యామ్ లో నీరు విపరీతంగా వచ్చి చేరుతోంది. స్పిల్ వేకు మరమ్మత్తు కు సుమారు 670 నుండి 1300 కోట్ల రూపాయాల ఖర్చు అవుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Residents of Oroville and nearby towns were ordered to immediately evacuate Sunday afternoon after a hole was discovered at the emergency spillway for the Oroville Dam. Officials said late Sunday that they will attempt to plug the hole using bags of rocks and try to reduce the water level at Lake Oroville to alleviate stress on the spillway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X