వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరంతా చనిపోతున్నారు: లాస్ వెగాస్ కాల్పులపై ముందే ఓ జంట హెచ్చరిక, దుండగుడు ఇతడే

లాస్ వెగాస్ దాడిలో 58 మంది వరకు మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడికి ముందు ఓ జంట వచ్చి.. మీరంతా చనిపోతున్నారని హెచ్చరించిందని ఓ మహిళ వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

A Couple Reportedly Warned That Everyone is Going to Lost Life in a Las Vegas Incident | Oneindia

లాస్ వెగాస్: లాస్ వెగాస్ దాడిలో 58 మంది వరకు మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడికి ముందు ఓ జంట వచ్చి.. మీరంతా చనిపోతున్నారని హెచ్చరించిందని ఓ మహిళ వెల్లడించింది.

లాస్ వెగాస్‌లో ఫెస్ట్‌లో కాల్పులు, 50 మందికి పైగా మృతిలాస్ వెగాస్‌లో ఫెస్ట్‌లో కాల్పులు, 50 మందికి పైగా మృతి

 ఆమె పుట్టిన రోజు జరుపుకునేందుకు వచ్చారు

ఆమె పుట్టిన రోజు జరుపుకునేందుకు వచ్చారు

అలా వెల్లడించిన మహిళ పేరు బ్రియన్నా హెండ్రిక్స్. ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆసక్తికర విషయం వెల్లడించారు. బ్రియన్నా తన స్నేహితులతో కలిసి 21వ పుట్టిన రోజు జరుపుకునేందుకు సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు.

 ఆ జంటలో అందరి జుట్టూ లాగిన మహిళ

ఆ జంటలో అందరి జుట్టూ లాగిన మహిళ

తాము అక్కడ ఉన్న సమయంలో కాల్పులు జరగడానికి 45 నిమిషాల ముందు ఓ జంట అక్కడకు వచ్చిందని, అందులో ఒక మహిళ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ అందరి జుట్టు పట్టుకొని లాగిందని బ్రియన్నా చెప్పారు.

వాళ్లంతా మన చుట్టూ, చనిపోబోతున్నారు

వాళ్లంతా మన చుట్టూ, చనిపోబోతున్నారు

వాళ్లంతా మన చుట్టూ ఉన్నారని, మీరంతా ఇవాళ చనిపోబోతున్నారని సదరు మహిళ అందరి జుట్టు లాగుతూ చెప్పిందని బ్రియన్నా హెండ్రిక్స్ వెల్లడించారు. ఆ తర్వాత పుట్టిన రోజు వేడుకల కోసం వచ్చిన బ్రియన్నా కాల్పులు జరగడానికి పది పదిహేను నిమిషాల ముందు అక్కడ నుంచి వెళ్లారు.

అమెరికా చరిత్రలో అత్యంత దారుణ కాల్పుల ఘటన

అమెరికా చరిత్రలో అత్యంత దారుణ కాల్పుల ఘటన

లాస్‌ వెగాస్‌లో ఓ సాయుధుడు విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఓ సంగీత కచేరీని లక్ష్యంగా చేసుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపి, 58 మందిని చంపేశాడు. ఇందులో 515 మంది గాయపడ్డారు. ఈ మారణహోమం తర్వాత ఆ దుండగుడు.. తనను తాను కాల్చుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా ఇది నిలిచిపోయింది. గత ఏడాది జూన్‌లో 49 మందిని బలిగొన్న ఆర్లాండో నైట్‌ క్లబ్‌ కాల్పుల విషాదాన్ని ఇది మించిపోయింది.

అందరూ జాసన్ ఆల్టీన్ కచేరీలో మునిగారు

అందరూ జాసన్ ఆల్టీన్ కచేరీలో మునిగారు

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ప్రఖ్యాత లాస్‌ వెగాస్‌ స్ట్రిప్‌లోని మ్యాండలే బే హోటల్‌ పక్కనే ఆరు బయట ఘనంగా సంగీత కచేరి జరుగుతోంది. దాదాపు ముప్పై వేల మంది సంగీత ప్రియులు దీనికి హాజరయ్యారు. రూట్‌ 91 హార్వెస్ట్‌ ఫెస్టివల్‌ కన్సర్ట్ పేరిట మూడు రోజుల పాటు జరిగే సంగీతోత్సవంలో భాగంగా దీన్ని నిర్వహించారు. రాత్రి పది గంటలు దాటింది. అక్కడ మంచి పేరున్న గాయకుడు జాసన్‌ ఆల్డీన్‌ వేదికపై ప్రదర్శన ఇస్తున్నారు. ప్రేక్షకులంతా ఆ సంగీత ప్రపంచంలో మైమరచిపోయి ఉన్నారు.

అంతలోనే కాల్పులు, పరుగు తీసిన గాయకుడు

అంతలోనే కాల్పులు, పరుగు తీసిన గాయకుడు

ఆ సమయంలో హఠాత్తుగా కాల్పుల శబ్దం వినిపించింది. తూటాలు దూసుకొచ్చాయి. మొదట అది టపాకాయల శబ్దంగా భావించిన జాసన్‌.. తన విభావరిని కొనసాగించారు. అంతలోనే వాటిని తుపాకీ కాల్పులుగా గుర్తించి వేదిక దిగి పరుగులు తీశారు. విభావరికి వచ్చిన వారు కూడా ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు.

 విచక్షణారహితంగా కాల్పులు, తొక్కిసలాట, మరుభూమిలా

విచక్షణారహితంగా కాల్పులు, తొక్కిసలాట, మరుభూమిలా

విచక్షణారహితంగా వచ్చిన తూటాలు తగిలి ప్రేక్షకులు పిట్టల్లా నేలకొరిగారు. మిగతావారు ఆందోళనతో హాహాకారాలు చేసుకుంటూ చెల్లాచెదురయ్యారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కిందపడి పోయినవారిని తొక్కుకుంటూ జనాలు పరుగులు తీశారు. బాధితులు వైద్యసాయం కోసం ఆర్తనాదాలు చేశారు. దిగ్భ్రాంతిలో ఉన్న కొందరు బాధితులు దుస్తులపై నెత్తుటి మరకలతో వీధుల వెంట పరుగులుపెట్టారు. మరుభూమిని తలపించింది.

కాల్పులు జరిపి, కాసేపు ఆగి మళ్లీ, దుండగుడు ఇతనే

కాల్పులు జరిపి, కాసేపు ఆగి మళ్లీ, దుండగుడు ఇతనే

దుండగుడు కాసేపు కాల్పులు జరిపి, ఆ తర్వాత కొద్దిసేపు ఆగి మళ్లీ కాల్పులు జరిపాడు. విషయం తెలియగానే ఎమర్జెన్సీ స్వాట్ బృందాలు రంగంలోకి దిగాయి. మ్యాండలే బే హోటల్‌లోని 32వ అంతస్తులో ఉన్న ఒక గది నుంచి ఆటోమేటిక్‌ తుపాకీతో దుండుగులు కాల్పులు జరుపుతున్నట్లు గుర్తించి, ఆ గది వద్దకు చేరుకున్నాయి. పేలుడు పదార్థంతో తలుపులు బద్దలుకొట్టి, లోపలికి ప్రవేశించింది. అప్పటికే ఆ దుండగుడు విగతజీవుడై పడి ఉన్నాడు. అతడు తనను తాను కాల్చుకున్నాడని భావిస్తున్నారు. దుండగుడిని స్టీఫెన్ పడోక్‌గా గుర్తించారు.

English summary
A COUPLE reportedly warning “everyone is going to die” were escorted out of a concert shortly before a Las Vegas shooting. At least 58 people, including two police officers, have been killed and over 515 wounded in an incident of mass shootout at the Mandalay Bay Resort in Las Vegas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X