"అమెరికా మమ్మల్ని టచ్ చేస్తే ఢిల్లీ, ముంబైపై బాంబులేస్తాం"..! బిగ్ షాకింగ్..!

ఓవైపు ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దానికి దిగి మూడు వారాలైంది. మరోవైపు ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలతో పాటు వాటిలో ఉన్న అమెరికా ఆస్తులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ యుద్ధంపై భారత్ పూర్తిగా సంయమనం పాటిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ లో పాకిస్తాన్ మాజీ రాయబారి (ex-pak envoy) అబ్దుల్ బాసిత్ (abdul basit) సంచలన వ్యాఖ్యలు చేసాడు. అమెరికా ఇరాన్ ను టచ్ చేస్తే ఆ దేశం గల్ఫ్ దేశాల్ని ఎలా నాశనం చేస్తోందో ఆ తరహాలో తమను టచ్ చేస్తే ఇండియాను లక్ష్యంగా చేసుకుంటామని బాసిత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పశ్చిమాసియాతో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్న వేళ తమపై విదేశీ దాడి జరిగితే పాకిస్థాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని భారత్ లో పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ అమెరికా పాకిస్థాన్‌పై దాడి చేస్తే, తాము రెండో ఆలోచన లేకుండా ముంబై (mumbai), న్యూఢిల్లీ (delhi)పై దాడి చేయాల్సి ఉంటుందని, తాము దాన్ని వదిలిపెట్టబోమని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ బాసిత్ వ్యాఖ్యానించాడు.

Ex-Pak Envoy s Shocker US Hits Our Nukes We ll Bomb Delhi Mumbai

వాస్తవానికి ఇలా పాకిస్తాన్ మన నగరాలపై దాడి చేసే సీన్ లేకపోయినా, వారి ఆలోచన చర్చనీయాంశంగా మారుతోంది. బాసిత్ కూడా ఇది (ఆమెరికా పాకిస్తాన్ పై దాడి చేయడం ) అసంభవం అంటూనే దానిని అసాధ్యమైన దాని నుండి పుట్టినది అంటూ అభివర్ణించాడు. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని దురుద్దేశంతో చూస్తే, పాకిస్థాన్‌కు భారతదేశంపై ఎక్కడ కావాలంటే అక్కడ దాడి చేయడం తప్ప మరో మార్గం ఉండదన్నాడు.అలా జరగాలని తాము కోరుకోవడం లేదని, భారత్ కూడా కోరుకోవడం లేదంటూ చెప్పుకొచ్చాడు. బాసిత్ 2014 నుండి 2017 వరకు న్యూఢిల్లీలో పాకిస్తాన్ అత్యున్నత దౌత్యవేత్తగా పనిచేశాడు.ఆ కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉండేవి. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+