26/11 ముంబై దాడులు మా వాళ్ల పనే: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ముంబై దాడులపై సంచలన ప్రకటన చేశారు. 26/11 ముంబై దాడులకు పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని స్పష్టం చేశారు.
ముంబై దాడులకు పాకిస్థాన్ నుంచే ఉగ్రవాదులు వచ్చారని చెప్పారు. 26/11 ముంబై దాడుల విచారణను పాకిస్థాన్ ఎందుకు పూర్తి చేయడం లేదని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో మిలిటెంట్లు చాలా చురుగ్గా ఉన్నారని చెప్పారు.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ముంబై దాడులకు పాల్పడ్డారంటూ భారత్ చెబుతున్నప్పటికీ.. సరైన ఆధారాలు లేవంటూ 9ఏళ్లుగా విచారణ సాగీస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం సాగదీస్తున్న విషయం తెలిసిందే. కాగా, పాకిస్థాన్ ఉగ్రవాదులు ముంబైలో 26/11న జరిపిన దాడుల్లో సుమారు 150మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు.












Click it and Unblock the Notifications