యువతికి షాకిచ్చిన 'ఐసిస్', ఫేస్‌బుక్ నో చెప్పింది

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: ఐసిస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు ఇదే పేరు ఓ బ్రిటన్ యువతికి చిక్కులు తెచ్చింది. అసలు ఐసిస్ అంటే ఈజిప్ట్ దేవత పేరు. ఆరోగ్యం, పెళ్లి, జ్ఞానం అని ఈ పేరుకు అర్థం. ఈ పేరు పెట్టుకున్న ఓ బ్రిటన్ మహిళకు ఫేస్‌బుక్ షాకిచ్చింది.

బ్రిటన్‌కు చెందిన 27 ఏళ్ల ఐసిస్‌ థామస్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఆమె తన పేరుతో తన ఫేస్‌బుక్‌ ఖాతాను నిర్వహించుకునేందుకు సామాజిక మీడియా సంస్థ నుంచి అనుమతి లభించలేదు.

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు సంబంధించిన అన్ని ఆనవాళ్లను తొలగించాలన్న విధానానికి అనుగుణంగా ఆమె గుర్తింపుకు సంబంధించిన ఆధారాలను పంపాలని స్పష్టం చేసింది. జూన్‌ 27న ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అవ్వడానికి ప్రయత్నించానని, పాస్‌వర్డ్‌ టైప్‌ చేశానని, ఆ వెంటనే పేరు మార్చుకోవాలన్న సూచన తెరపై ప్రత్యక్షమైందని ఆమె తెలిపింది.

తన అసలు పేరు ఐసిస్‌ థామస్‌ అని, అయినా నేను తొలుత పని చేసిన నగరం పేరిట ఐసిస్‌ వోర్సెస్టర్‌గా ఫేస్‌బుక్‌లో నమోదు చేసుకున్నానని, పేరు మార్చుకోవాలనగానే తొలుత ఇంటి పేరును మార్చి ఐసిస్‌ థామస్‌ అని టైప్‌ చేశానని, అయినా ఫలితం లేదని, ఐసిస్‌తోనే సమస్య ఉందని అప్పుడు గుర్తించానని చెప్పింది.

Facebook asks woman named Isis to change profile name, submit proof

ఐసిస్‌ అనే పేరును అనుమతించబోమని సందేశం కంప్యూటర్‌ తెరపైన ప్రత్యక్షమైందని, గుర్తింపుకు సంబంధించిన ఆధారాలు పంపాలని కూడా ఫేస్‌బుక్‌ తనకు సూచించిందని తెలిపింది.

ఆ మేరకు పత్రాలను పంపానని, అయినా అప్పటి నుంచి సైట్‌లోకి ప్రవేశించేందుకు తనను అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తన పేరును మార్చుకునే ప్రసక్తే లేదని, ఆ పేరంటే తనకు చాలా ఇష్టమని, పైగా ఇది తన అసలు పేరని ఫేస్‌బుక్‌ గుర్తించాలని పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In its bid to erase all traces of ISIS (also Islamic State or IS), Facebook has asked a terror group namesake to send her proof of ID to continue using the social network.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి