శుభవార్తే: ఫేస్ బుక్ పోస్టుల రూల్స్ మార్పు, నిఘాకు చెక్ పెట్టేసిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ తన నిబంధనలను కఠినతరం చేసింది.పేస్ బుక్ లో పోస్టుల ఆధారంగా పోస్ట్ చేసిన వారిపై నిఘా ఏర్పాటు చేయకుండా నిబంధనలను మార్చేసింది.

వాషింగ్టన్: ఫేస్ బుక్ తన నిబంధనలను కఠినతరం చేసింది. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో ఉన్న సమాచారాన్ని సేకరించి, దాని ఆధారంగా నిఘా పెట్టడానికి సంస్థలకు వీలు లేకుండా నిషేధించింది.

సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకొంటున్నాయని వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు.

ప్రధానంగా కొన్ని దేశాల్లో వర్ణవివక్షతో కూడ ఇలా కొంత మందిని టార్గెట్ చేస్తున్నట్టు తెలిపింది. తమ అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పేందుకుగాను ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకొనేవాళ్ళకు ఈ సోషల్ మీడియా నిఘా అనేది పెనుముప్పుగా పరిణమించింది.

Facebook Bans Use of User Data for Surveillance

కొన్ని చట్ట సంస్థలు కూడ ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని వ్యక్తుల మీద కేసులు పెడుతున్నాయని ఏసిఎల్ యూ తరపు న్యాయవాది మాల్ కాగిల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఇలా ఫేస్ బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోవడాన్ని పూర్తి నిషేధించినట్టు ఆ సంస్థ వివరించింది.

అయితే నిఘా అంటే ఏంటన్న విషయాన్ని మాత్రం పూర్తిగా వివరించలేదు.ఫేస్ బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరెవరు ఎలాంటి పోస్టింగ్ లు చేస్తున్నారో పరిశీలించవచ్చు.

అమెరికాలాంటి దేశాల్లో నిఘా సంస్థలు ఈ టూల్స్ విస్తృతంగా వాడుతున్నాయి. ఇందుకోసం 2010 నుండి ఇప్పటివరకు రూ.40 కోట్లు వెచ్చించాయి. అయితే తాము పోస్టు చేస్తున్న సమాచారమే తమకు ఇబ్బంది కల్గిస్తోందన్న విషయం చాలా మందికి తెలియదు.

దాంతో ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ఫేస్ బుక్ తన పాలసీని పూర్తిగా మార్చింది.అందులోని సమాచారాన్ని నిఘా అవసరాల కోసం ఉపయోగించకుండా నిబంధనలను విధించింది. తన ప్లాట్ ఫాం ను నిఘా కోసం ఉపయోగించే టూల్స్ ను తయారు చేసే డెవలపర్ పై తాము ఇప్పటికే చర్యలు తీసుకొంటున్నట్టు పేస్ బుక్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+