వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ .. యూజర్ల ఆగ్రహం, పరిష్కరిస్తామన్న కంపెనీలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సోషల్ మీడియా ద్వారా జరిగే విషయాలన్నీ మునివేళ్లతో తెలుసుకుంటోంది యువత. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సందేశాలు, పోస్టుల పూట గడుపుతోంది. అలాంటి ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ అయితే పరిస్థితి ఏంటీ ? యూత్ చేయి ఆడకపోవడంతో .. యాజమాన్యాలపై గుర్రుగా ఉన్నారు.

రఫెల్ రహస్యం శత్రువులకు చేరింది ? సమాచారం ఆధారంగానే పిటిషన్.. కేంద్రం అఫిడవిట్, నేడు విచారణరఫెల్ రహస్యం శత్రువులకు చేరింది ? సమాచారం ఆధారంగానే పిటిషన్.. కేంద్రం అఫిడవిట్, నేడు విచారణ

 నిన్న అర్ధరాత్రి నుంచి సమస్య

నిన్న అర్ధరాత్రి నుంచి సమస్య

బుధవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియా ప్రధాన వెబ్ సైట్ల సర్వర్లు డౌనయ్యాయి. దీంతో కొందరి వెబ్ సైట్లు ఓపెన్ కావడం లేదు. మరికొందరు యూజర్ల వెబ్ సైట్లు ఓపెన్ అయినా ఎలాంటి పోస్టులు వెళ్లడం లేదు, రావడం లేదు. మరికొందరి సైట్లలో అన్నీ కనిపిస్తోన్నా .. పోస్ట్ చేసినా సమాచారం కనిపించడం లేదు. దీంతో యూజర్లు ఏం జరిగిందని ఆందోళన చెందుతున్నారు. ఫేస్ బుక్ లేనిది ఒక్క పూట గడవని యువత .. దాదాపు సగం రోజు పూర్తవుతోన్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం ..

వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం ..

ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ తో యువత ఇబ్బందులు పడుతుంటే .. యాజమాన్యం స్పందించింది. 'కొందరు ఫేస్ బుకు, ఇన్ స్ట్రాగ్రామ్ పేజీ ఓపెన్ కావడం లేదు. ఈ సమస్యను గుర్తించాం, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం అని‘ ట్వీట్ చేసింది ఫేస్ బుక్. 'ఇన్ స్ట్రాగ్రామ్ తో కూడా యూజర్లు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించాం, సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని‘ ఇన్ స్ట్రాగ్రామ్ పేర్కొంది.

ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ డౌన్ .. ట్విట్టర్ ట్రెండింగ్

ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ డౌన్ .. ట్విట్టర్ ట్రెండింగ్

సోషల్ మీడియా రారాజు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ అయ్యింది. గురువారం ఉదయం వరకు సమస్య పరిష్కారం కాలేదు. దీంతో యూజర్లు మొత్తం మరో సామాజిక మాధ్యమం ట్విట్టర్ వైపు చూస్తున్నారు. వరుస ట్వీట్లు చేస్తూ .. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ సమస్యను మరచిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

 జీ-మెయిల్ కూడా ..

జీ-మెయిల్ కూడా ..

ఫేస్ బుక్ కు సర్వర్ డౌన్ సమస్య తలెత్తిందో లేదో ఆ వెంటనే ఇన్ స్ట్రాగ్రామ్ తర్వాత జీ-మెయిల్ కు కూడా సమస్య పాకింది. గురువారం నుంచి జీ-మెయిల్ కూడా మెయిల్ పంపించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ సమస్య వ్యక్తిగత, కంపెనీ మెయిల్స్ సర్వీసులకు తలెత్తిందని ఆ సంస్థ యాజమాన్యం ప్రకటిచింది. గత జనవరిలో కూడా జీ-మెయిల్ ఇండియా, యూర్ లో సర్వర్ డౌన్ సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

English summary
users across the world are finding it difficult to access social networking websites Facebook and Instagram. The problem, first reported on Wednesday night, persisted on Thursday morning. Both companies took to Twitter to acknowledge the problem. “We’re aware that some people are currently having trouble accessing the Facebook family of apps. We’re working to resolve the issue as soon as possible,” the official Twitter handle of Facebook stated in a tweet. Instagram, meanwhile, tweeted: “We know this is frustrating, and our team is hard at work to resolve this ASAP.” Users are finding the sites inaccessible or are unable to log in from their accounts. #FacebookDown and #InstagramDown were trending on Twitter on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X