ఉద్యోగుల కోసం ఫేస్‌బుక్ సరికొత్త యాప్: ఇక వర్క్‌ప్లేస్ లోను ఉపయోగించుకోవచ్చు..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త యాప్ రూపొందించింది. వర్క్‌ప్లేస్‌లో ఉద్యోగుల మధ్య సమన్వయం కోసం ఈ చాటింగ్ యాప్ ను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీఎస్ లలో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫేస్ బుక్ వర్క్ ప్లేస్ కు ఈ యాప్ అనుంధంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య మెసేజ్ లకు ఇది ఉపయోగపడుతుంది. ప్రాజెక్టులు, ఇతరత్ర చర్చల వంటివి ఈ యాప్ ద్వారా కొనసాగించవచ్చు. లైవ్ వీడియో సెషన్స్ ఏర్పాటు చేసుకునే సదుపాయం కూడా ఉంది.

Facebook launches new Workplace Chat app for offices

వర్క్‌ప్లేస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగులు ఎక్కువగా మొబైల్‌ డివైజ్‌ల కంటే తమ డెస్క్‌టాప్‌లనే వాడుతుంటారు. ఎక్కువ సమయం డెస్క్‌టాప్‌లకే కేటాయిస్తుంటారు. అందువల్లే ఫేస్ బుక్ ఈ డెస్క్ టాప్ యాప్ తీసుకొచ్చింది. వర్క్ ప్లేస్ చాట్ ద్వారా సహ ఉద్యోగులతో లేదా గ్రూపుతో వీడియో చాట్, స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్, మెసేజ్, రియాక్షన్స్, జీఐఎఫ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Facebook has unveiled a new chat app to connect various departments within an office. Called the Workplace Chat, the app will be available for Android, iOS, and PCs.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి