• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆందోళన: రైతు దీక్షపై అమెరికన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌ పంచ్

|

వాషింగ్టన్: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు రైతులు చేస్తోన్న నిరసనలు, ఆందోళనలు.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మాజీ పోర్న్ స్టార్ మియా ఖలిఫా, బార్బేడియన్ పాప్ సింగర్, హాలీవుడ్ నటి రిహానా వంటి సెలెబ్రిటీలు రైతు దీక్షపై స్పందిస్తున్నారు. నైతికంగా వారికి అండగా ఉంటున్నారు. రైతు ఆందోళనలకు ట్వీట్ల ద్వారా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సారి నిమ్మగడ్డ టార్గెట్ ఆయనే? గవర్నర్‌తో భేటీ కానున్న నిమ్మగడ్డ: తొలిదశ పోలింగ్ వేళ

ఈ సారి అమెరికన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ సూపర్ బౌల్.. రైతు దీక్షలపై స్పందించింది. మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనగా రైతు దీక్షను అభివర్ణించింది. దీనిపై 30 సెకెన్ల పాటు నిడివి ఉన్న ఓ వీడియోను ప్రదర్శించింది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ అడ్వర్టయిజ్‌మెంట్లను ప్రదర్శించడానికి ఉపయోగించే ఈ ప్లాట్‌ఫామ్‌పై రైతుల దీక్షలు, ఆందోళనలకు సంబంధించిన 30 సెకెన్ల నిడివి ఉన్న ఓ వీడియో ప్రసారం కావడమంటే మాటలు కాదు. మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనను తాము చూస్తున్నామని పేర్కొంది.

farmers protest: NFL Super Bowl draws attention as largest protest in the human history

సీబీఎస్ ఛానల్‌లో థంపా బే బుకాన్నీర్స్, కన్సాస్ సిటీ ఛెఫ్స్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతోన్న సమయంలో కమర్షియల్ బ్రేక్ సందర్భంగా రైతు దీక్షకు సంబంధించిన వీడియో టెలికాస్ట్ అయింది. కాలిఫోర్నియా సహా పలు నగరాల్లో ఈ యడ్ ప్రసారమైంది. భారీగా ఛార్జీని వసూలు చేసే స్లాట్‌లో ప్రసారమైన రైతు దీక్ష వీడియోను టెలికాస్ట్ చేయడానికి అవసరమైన ఖర్చును ఎవరు భరించారనేది ఇంకా తెలియరాలేదు. స్వచ్ఛందంగానే ఈ వీడియోను టెలికాస్ట్ అయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కోటి మందికి పైగా వీక్షకులు ఈ యాడ్‌ను చూశారని అంచనా వేస్తున్నారు.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సూక్తులతో ఈ వీడియో ఆరంభమౌతుంది. వి ఆర్ ఫార్మర్స్.. రెండులక్షలకు పైగా ట్రాక్టర్లు.. 160కి పైగా మరణాలు.. ఆరునెలలకుపై దీక్ష.. ఏడు మానవ హక్కుల ఉల్లంఘనలు.. అంటూ సాగుతుంది ఈ వీడియ. రిహానా చేసిన ట్వీట్‌ను ఇందులో ఓ స్లైడ్‌గా చూపించారు. నో ఫార్మర్స్..నో ఫుడ్.. నో ఫ్యూచర్.. అనే పదాలతో ఈ వీడియో ముగుస్తుంది. 32 సెకెన్ల నిడివి ఉన్న అడ్వర్టయిజ్‌మెంట్ కోసం సూపర్ బౌల్ యాడ్స్ సంస్థ.. 5.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దాదాపు అదే నిడివిలో ఉన్న రైతు దీక్ష వీడియో కోసం ఎంత ఛార్జ్‌నుతీసుకుందనేది తెలియరావాల్సి ఉంది. దీన్ని ఎవరు స్పాన్సర్ చేశారనేది తేలాల్సి ఉంది.

English summary
Super Bowl, the American National Football League, is a platform where some of the world's most famous ads are launched every year, and this year apart from the regular commercials the game draws attention towards the farmers’ protest in India, terming it the "largest protest in the human history".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X