వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిరుదులు పెద్దగా కనిపించే సర్జరీ: మహిళా ప్రాణం తీసింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వర్జీనియా: అందంగా కనిపించాలని కాస్మోటిక్ సర్జరీ కోసం పశ్చిమ వర్జీనియాకు చెందిన ఓ మహిళ చెందిన ఫ్లోరిడాకు చేసిన ప్రయాణం ఆమె చివరి ప్రయాణమైంది. వివరాల్లోకి వెళితే ఆ మహిళ పేరు హీతర్ మెడాస్ (29). ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది.

బ్రెజీలియన్ బట్ లిఫ్ట్(పిరుదులు పెద్దగా కనిపించడానికి చేసే సర్జరీ) ద్వారా ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంది. వర్జీనియాకు చెందిన హీతర్ 'బట్ లిఫ్ట్' సర్జరీ ఫెయిల్ అవడంతో ఫ్లోరిడాలో హిలియాలోని ఆసుపత్రిలో మృతి చెందింది.

హీతర్‌కు చేసిన 'బట్ లిఫ్ట్' ప్లాస్టిక్ సర్జరీ వల్ల గుండెకు రక్త సరఫరా చేసే నాళాల్లో కొవ్వు అడ్డుపడటంతో(ఫ్యాట్ ఎంబోలిజమ్) ఆమె మృతి చెందినట్టు మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో పేర్కొన్నాడు. అంతేకాదు హీతర్ మృతిని అనుకోకుండా జరిగిన ప్రమాదంగా గుర్తించారు.

'Fat Embolism' Cited in Death of Woman After Plastic Surgery in Hialeah

నిజానికి బ్రెజీలియన్ 'బట్ లిఫ్ట్' సర్జరీలో ముందు లైపోసెక్షన్ ద్వారా ఉదరభాగం నుంచి కొవ్వును తీసి పిరుదుల స్థానంలో ఇంజక్ట్ చేస్తారు. ఒక వెబ్‌సైట్ ద్వారా బ్రెజీలియన్ 'బట్ లిఫ్ట్' సర్జరీ గురించి తెలుసుకున్న హీతర్.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు గతంలో తన స్నేహితురాలితో ఇక్కడి వచ్చింది.

అయితే ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్న సమయంలో హీతర్ శరీరంలోని కొవ్వు పదార్థల మార్పిడిలో చోటుచేసుకున్న తప్పిదం వల్ల ఆమె అవయవాలు పనిచేయకుండా పోయాయని పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కాగా హీతర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కుమార్తె మృతి కేసులో చోటు చేసుకున్న పరిమాణాలపై విచారణ జరపాల్సిందిగా హీతర్ తల్లి స్థానిక అటార్నీకి ఫిర్యాదు చేశారు. దీంతో అటార్నీ హీతర్‌కు సంబంధించిన అన్ని మెడికల్ రికార్డులను తనకు సమర్పించాల్సిందిగా పోలీసులకు సూచించారు.

English summary
A West Virginia woman who died after undergoing plastic surgery at a South Florida clinic suffered a fat embolism, or clogged blood vessel, according to the medical examiner's report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X