Covid-19: వైరస్‌కు వాటితోనే చెక్ పెట్టొచ్చు...పరిశోధకులు చెబుతున్న మెడిసిన్ ఏంటి..?
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ఫార్మా కంపెనీలు ఈ మహమ్మారికి విరుగుడు మందును కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మందుల తయారీకి అనుమతులు కూడా వచ్చేశాయి. ఇక అప్పట్లో కరోనాకు విరుగుడు పారాసిటామాల్ అని చాలామంది ప్రముఖులు కూడా చెప్పారు. దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా మద్దతు పలికింది. తాజాగా కరోనాకు విరుగుడు శరీరంలో క్రొవ్వును నియంత్రించేందుకు లేదా క్రొవ్వును తగ్గించేందుకు వినియోగించే మందులు వాడితే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కొత్త పరిశోధన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
Recommended Video

ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్
న్యూయార్క్‌లోని మౌంట్ సీనాయ్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కోవిడ్-19 పేషెంట్ల శ్వాసకోశ వ్యవస్థను పరిశీలించారు. అయితే ఊపిరితిత్తుల్లో వారు కొంత మార్పును గమనించినట్లు చెప్పారు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కార్బోహెడ్రేట్స్‌ను కరిగించడంలో వైరస్ అడ్డుకుంటుందన్న విషయాన్ని వీరు గమనించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక టెలిగ్రాఫ్ ఒక రిపోర్టులో పేర్కొంది. అయితే దీనర్థం ఏమిటి..?

ప్రస్తుతం ఉన్న మెడిసిన్స్‌తోనే వైరస్‌కు చెక్
ఊపిరితిత్తుల్లో కార్బోహైడ్రేట్స్ క్రొవ్వును నింపుతాయి. దీంతో ఇక్కడ వైరస్ అనేది పునరుత్పత్తి చెందుతుంది. ఇప్పుడు ఇదే కోవిడ్-19 పేషెంట్లకు సంబంధించి అనేక విషయాలని వివరిస్తుంది. బీపీ, అధిక కొలెస్ట్రాల్, మరియు డయాబెటిస్ వ్యాధులు ఉన్నవారే అధికంగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఇక పరిశోధకులు దీనిపైనే ఫోకస్ చేశారు. ఇలాంటి వారిలో వైరస్ ప్రభావం ఎలా ఉంది ఏమేరకు ఉందనే విషయంపై పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు దీన్ని ఆదిలోనే తుంచేందుకు లేదా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఆదిశగా దీనిపై దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ సక్సెస్‌ఫుల్‌గా వచ్చేందుకు మరింత సమయం పడుతుంది కాబట్టి ఆలోగ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఔషధాలతోనే వైరస్‌కు చెక్ పెట్టేలా ప్రయత్నాలు ప్రారంభించారు.

విరుగుడుగా ఫెనోఫైబ్రేట్ మెడిసిన్
ఇక పరిశోధకులు చేసిన పరిశోధనల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధం ఫెనోఫైబ్రేట్ (ట్రైకార్) వైరస్‌కు చెక్ పెడుతుందనే డెసిషన్‌కు వచ్చేశారు. ఈ మెడిసిన్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంతో వైరస్‌ను నియంత్రిస్తుందని తద్వారా తిరిగి పునరుత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇక వీరు చేసిన పరిశోధనల్లో కోవిడ్-19 పేషెంట్స్‌కు ఫెనోఫైబ్రేట్ ఔషధం ఇవ్వగా కేవలం ఐదు రోజుల్లో వైరస్ వారినుంచి మాయమైందని చెప్పారు. అయితే ఈ ఔషధం వైరస్‌కు విరుగుడు అని కచ్చితంగా చెప్పేందుకు మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పిన పరిశోధకులు దీనిపై ఆధారపడొచ్చనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications