Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో మరో దారుణం.. కారుపై మూత్ర విసర్జన.. అడిగితే చంపేశారు..!

కెనడాలో దారుణమైన ఘటన జరిగింది. మరో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ దుండగులు భారత సంతతి వ్యక్తిని తలపైన కొట్టి కిరాతకంగా హతమార్చారు. కెనడాలోని ఎడ్ మాంటన్ లో ఈ ఘటన జరిగింది. మృతుడు బిజినెస్ మ్యాన్ అర్వి సింగ్ సాగో గా గుర్తించారు. ఈ ఘటన అక్టోబర్ 19 న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్వి సింగ్ దాదాపు ఐదు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 24 న మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఏం జరిగింది..?

భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అర్వి సింగ్ సాగో.. అక్టోబర్ 19న కెనడాలోని ఓ రెస్టారెంట్ కు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ కు వెళ్లాడు. డిన్నర్ ముగించుకుని వస్తుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తులు సాగో కారుపై మూత్రం పోస్తూ కనిపించారు. హే.. ఏం చేస్తున్నావ్ అంటూ సాగో.. కారువైపుకు పరుగెత్తుకొంటూ వచ్చాడు. దీంతో వాళ్లు సాగోపై దాడి చేశాడు. తలపై కొట్టారు. పొట్ట , ఛాతిపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో అతడు కింద పడిపోయాడు. వెంటనే సాగో గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతడ్ని సమీప ఆస్పత్రికి తరలించారు. దాదాపు ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన సాగో.. అక్టోబర్ 24 న ప్రాణాలు కోల్పోయాడు.

Fatal Confrontation Indian Dad s Simple Question Ends in Brutal Death Over Car Vandalism

ఈ ఘటనకు పాల్పడింది కైల్ పాపిన్ అనే వ్యక్తిగా ఎడ్ మాంటన్ పోలీసులు గుర్తించారు. వెంటనే అతనిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో భారత సంతతి వ్యక్తులపై దాడులు అధికం అవుతున్నాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లోని భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు. ఆయా రాష్ట్రాల్లో గన్ కల్చర్ కూడా పెరిగిపోయింది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+