వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

International Fathers Day 2022: నిజ జీవిత కథానాయకుడు.. నాన్న

|
Google Oneindia TeluguNews

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ అయితే.. ఆ ప్రపంచాన్ని నీకు పరిచయం చేసేవాడు నాన్న. కొన్ని బంధాలను మనం వర్ణించాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. తప్పటడుగులు వేస్తుంటే పడిపోయే ప్రతి అడుగులోనూ నేనున్నానంటూ పడకుండా పట్టుకునే చేయే నాన్న. ఆ తప్పటడుగులు ఒక్క చిన్నతనంలోనే కాదు.. జీవితమంటే తెలిసీ తెలియకుండా వేసే ప్రతి అడుగులోను నాన్న అడుగు మన వెనకే ఉంటుంది. దారి తప్పిన ప్రతి అడుగును సవ్య దిశగా మళ్లిస్తాడు.

 గుండెల్లో ప్రేమను దాచుకునే త్యాగశీలి

గుండెల్లో ప్రేమను దాచుకునే త్యాగశీలి

గంభీరంగా కనిపించే ఆ ప్రతిబింబం గుండె లోతుల్లో వెలకట్టలేని ప్రేమ ఉంటుంది. ప్రేమ బయటకు వ్యక్తం చేస్తే గారాబం ఎక్కువై జీవితంలో దెబ్బతింటారనే ఉద్దేశంతో గుండెను దిటవు చేసుకొని తన ప్రేమను దాచుకొనే త్యాగశీలి. క్రమశిక్షణ అనేది ఒక పదం. ఆ పదానికి రూపం వస్తే నాన్నే. తప్పు చేస్తే మరోసారి తప్పు చేయకుండా భయపెట్టేది.. దండించేది.. అడగకుండానే మన అవసరం తెలుసుకొని తీర్చేది.. జీవితాన్ని హద్దుల్లో నిలబెట్టేది నాన్నే. తాను పడుతున్న ఇబ్బందులు తన కంటిపాపకు తెలియకూడదనుకుంటాడు. అందుకే నాన్నే మన నిజ జీవితానికి కథానాయకుడు. జీవితంలో నాన్న చూసినన్ని ఒడిదుడుకులు మరెవరూ చూడరు. అందుకే ఆయన్ను గౌరవించుకోవడానికి జూన్ నెలలో వచ్చే మూడో ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా జరుపుకుంటున్నాం.

పిల్లల్ని చూసుకొనే తల్లిదండ్రుల ధైర్యం

పిల్లల్ని చూసుకొనే తల్లిదండ్రుల ధైర్యం


నాన్నకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులుంటాయి. మీకు బాధ్యత తెలియజేయడం కోసం ఏదైనా పని చెబితే సంతోషంగా చేయండి. ఆయన చెప్పకుండానే చేస్తే తన పిల్లలు బాధ్యత తెలుసుకొని జీవిస్తున్నారని ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు ధైర్యంతో జీవిస్తుంటారు. నాన్న నిద్ర లేవగానే పేపరు అందించండి.. లేదంటే మీ చేత్తో మంచి కాఫీ అందించడి.. నాన్న కళ్లల్లో సంతోషం చూడండి. పనుల్లో సాయం చేయండి.
నాన్నకు ఏ పనిచేస్తే నచ్చుతుందో తెలుసుకొని ఆ పని చేయండి. ఎందుకంటే ఆ సమయంలో నాన్న కళ్లల్లో కనిపించే సంతోషం మీకు ఎంతో తృప్తినిస్తుంది.

నేనున్నాననే భరోసానివ్వండి!

నేనున్నాననే భరోసానివ్వండి!


పిల్లలు బాధ్యతగా మెలిగితే తల్లికన్నా తండ్రి ఎక్కువ సంతోషిస్తాడు. ఎందుకంటే తనకో చేదోడు దొరికిందని, తన భుజాలపై భారం తగ్గుతోందని ఆనందపడతాడు. ఆ భరోసా తండ్రికివ్వాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉంటుంది. కుటుంబం కోసం తాను ఎంత కష్టపడుతున్నాడో అనే విషయాన్ని పిల్లలు తెలుసుకొని తనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు అంటే ఆ తండ్రికి అంతకుమించిన తృప్తి, అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.

 నాన్న ప్రేమిస్తాడు.. వ్యక్తం చేయడు!

నాన్న ప్రేమిస్తాడు.. వ్యక్తం చేయడు!


నాన్న ప్రేమిస్తాడు.. వ్యక్తం చేయడు. నాన్న ఆదరిస్తాడు.. ఆర్భాటం చేయడు.. అందుకే అనాదిగా తండ్రి పూజ్యనీయ స్థానంలో ఉన్నాడు. తండ్రిపట్ల భయభక్తులేకాదు.. మమతానురాగాల్ని కూడా పంచాలి. అదే మనం ఆయనకిచ్చే గౌరవం. ధర్మమూర్తి అయిన తండ్రికి సేవ చేస్తే కీర్తి, మోక్షం సిద్దిస్తాయని పద్మపురాణం చెబుతోంది. ఎవరివల్ల మనకు ఈ శరీరం సంప్రాప్తించిందో ఆయన భగవత్ స్వరూపుడు.. తండ్రిని సేవించడం పరమ ధర్మమనేది భారతదేశ ప్రాచీన ఆచారం.

English summary
Father's Day 2022: Themes,Importance,History and Significance,All you need to know about Father's Day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X