16 మందిని చంపిన మహిళా సూసైడ్ బాంబర్

విస్ఫోటన తీవ్రతకు పై అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. మహిళా ఆత్మాహుతి బాంబరే దాడికి పాల్పడి ఉంటుందని జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటనలో అభిప్రాయపడింది. సంఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని రష్యా దర్యాప్తు కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు.
సంఘటనలో 16మంది మరణించారని, 40మంది గాయపడ్డారని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ధ్రువీకరించారు. సోవియట్ యూనియన్ శకంలో స్టాలిన్‌గ్రాడ్‌గా పేర్కొన్న ఈ ప్రాంతంలో గతంలోనూ మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి జరిగిందని వెల్లడించారు.
దాడులతో ఉత్తర కాకసస్‌లోని సాయుధ ఇస్లామిక్ దళాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్నారు. సోచి రిపబ్లిక్‌లో ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్న తరుణంలో జరిగిన ఆత్మాహుతి దాడులు నిర్వాహకులను బెంబేలెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications