బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య.. ఇప్పటికి ఐదుగురు..

బంగ్లాదేశ్‌ లో హిందువులపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. హిందూ మైనారిటీ ప్రజలపై దాడులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో హిందువును దారుణంగా హతమార్చారు. రాణా ప్రతాప్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇప్పటికే ఐదుగురు హిందువులను కిరాతకంగా హతమార్చి , మృతదేహాలను కాల్చిన విషయం తెలిసిందే. అలాగే ఓ హిందూ వితంతు మహిళపై అత్యాచారం చేసి ఆమె జుట్టు కత్తిరించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే.

భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లో ఎన్నికల సమయంలో హిందువుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో హిందూ మైనారిటీ యువకుడ్ని కాల్చి చంపారు దుండగులు. బంగ్లాదేశ్​ లో దీపూ చంద్ర దాస్‌, అమృత్‌ మండల్‌, బజేంద్ర బిస్వాస్ ల హత్యలు మరువక ముందే మరో ఘటన జరగడంతో బంగ్లాదేశ్ లో హిందువులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

Fifth Hindu Man Brutally Murdered in Bangladesh Rana Pratap Shot Dead in Jessore Alarming Rise in Attacks

తాజాగా జెస్సోర్ జిల్లాలోని కోపాలియా బజార్ వద్ద రాణా ప్రతాప్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మీడియా కథనాల ప్రకారం ప్రతాప్ ది అరువా గ్రామం అని తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో స్పాట్ లోనే అతడు మృతి చెందాడు. ఘటన తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+