ట్రంప్‌కి మెంటల్.. అధ్యక్షపదవికి అనర్హుడు, అమెరికాలో దుమారం రేపుతున్న పుస్తకం..

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి రాసిన ఓ పుస్తకం ఇప్పుడు అమెరికాలో దుమారం రేపుతోంది. ఆ పుస్తకం పేరు 'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ది ట్రంప్ వైట్‌హౌస్'. ఈ పుస్తకం విడుదలను అడ్డుకునేందుకు కూడా ట్రంప్ యంత్రాంగం ప్రయత్నించిందట.

'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ది ట్రంప్ వైట్‌హౌస్' పుస్తక రచయిత మైఖేల్ వోల్ఫ్. ట్రంప్ జీవితాన్ని, ఆయన వ్యవహార శైలిని చాలా దగ్గర్నించి పరిశీలించి, అన్నీ వాస్తవాలే రాశానని రచయిత అంటుండగా.. అవన్నీ ఒట్టి అబద్ధాలని, అభూత కల్పనలని ట్రంప్ కొట్టిపారేస్తున్నారు.

ఇంతకీ పుస్తకంలో ఏముంది?

ఇంతకీ పుస్తకంలో ఏముంది?

‘ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ది ట్రంప్ వైట్‌హౌస్' పుస్తకంలో ట్రంప్‌పై వ్యతిరేక వ్యాఖ్యలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మతిమరుపు ఉందని, ఆయన మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని, అసలు ఆయన అమెరికా అధ్యక్ష పదవికి అర్హుడు కాడనే వ్యాఖ్యానాలున్నాయి. అందుకే ఈ పుస్తకం ప్రస్తుతం అమెరికాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పుస్తకం విడుదలయ్యాక.. ట్రంప్ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా మొదలైందట.

ట్రంప్ మాజీ వ్యూహకర్త ద్వారా...

ట్రంప్ మాజీ వ్యూహకర్త ద్వారా...

ఈ పుస్తక రచయిత మైఖేల్ వోల్ఫ్ ట్రంప్ ఇంటర్వ్యూ కోసం ఎంతగానో ప్రయత్నించాడట. 30 సార్లు రిక్వెస్ట్ పంపినా శ్వేతసౌధంలోకి అతడికి అనుమతి లభించలేదట. దీంతో మైఖేల్ వోల్ఫ్ తెలివిగా అధ్యక్షుడు ట్రంప్‌కు గతంలో వ్యూహకర్తగా పనిచేసిన స్టీవ్ బానన్ ద్వారా ట్రంప్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై కూపీలాగాడట. అతడి సహకారంతో శ్వేత సౌధంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ పుస్తకం రచించారట.

అన్నీ అబద్ధాలు.. అభూత కల్పనలే...

అన్నీ అబద్ధాలు.. అభూత కల్పనలే...

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ది ట్రంప్‌ వైట్‌హౌస్‌' పుస్తకం రచయితపై మండిపడుతున్నారు. తానెన్నడూ మైఖేల్ వోల్ఫ్‌కు ఇంటర్వ్యూనే ఇవ్వలేదని, అతడు రాసినవన్నీ అబద్ధాలని, అభూత కల్పనలని ఆయన కొట్టిపారేస్తున్నారు.

ట్రంప్‌ది చిన్నపిల్లాడి మనస్థత్వం...

ట్రంప్‌ది చిన్నపిల్లాడి మనస్థత్వం...

రచయిత మైఖేల్ వోల్ఫ్ రాసినదాని ప్రకారం చూస్తే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏ అంశంపైనైనా, ఏ విధాన నిర్ణయంపైనైనా ఆయన పట్టుమని పది నిమిషాలు కూడా దృష్టి నిలపలేరట. గతంలో ఓ విషయాన్ని అరగంటలో పదిసార్లు చెప్పేవారట. ఇప్పుడు పదినిమిషాల్లో పదిసార్లు చెబుతున్నారట. ఈ విషయాలన్నీ ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన వారు చెప్పినవేనట.

జ్ఞాపకశక్తి కూడా అంతంత మాత్రమే...

జ్ఞాపకశక్తి కూడా అంతంత మాత్రమే...

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ జ్ఞాపకశక్తి కూడా అంతంత మాత్రమేనట. ఆయనకు ఏదీ సరిగా గుర్తుండదట. కీలక వ్యక్తులను కూడా ఆయన తరచూ మరిచిపోతుంటారట. ఫాక్స్ న్యూస్ చీఫ్ రోజర్, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ జాన్ బొయినర్‌లను కూడా ఆయన గుర్తుపట్టలేకపోయారట. రాజ్యాంగంలోని కీలక అంశాలను విడమర్చి చెప్పినా ఆయన అర్థం చేసుకునేవారు కాదట. మొదటి డిబేట్‌కు ముందు 8 రోజుల పాటు ఆయనకు శామ్‌ నన్‌బెర్గ్‌ అనే నిపుణుడి చేత అన్నీ విడమరిచి చెప్పించినా ఉపయోగం లేదట.

స్నేహితుడి పెళ్లాన్ని పక్కలోకి...

స్నేహితుడి పెళ్లాన్ని పక్కలోకి...

ట్రంప్ స్త్రీలోలుడు అన్నది నిజమేనట. అందులోనూ స్నేహితుల పెళ్లాలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేవారట. ‘స్నేహితుడి పెళ్లాన్ని పక్కలోకి పిలిపించుకోవడమనేది గొప్ప అనుభూతి.. జీవితం సార్థకమవుతుంది..' అని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించేవాడట. ఓ స్నేహితుడి భార్యను అలాగే తన పక్కలోకి రప్పించుకునేందుకు కూడా ప్రయత్నించాడట. ‘నువ్వు కోరుకునే సౌఖ్యం నీ మొగుడి దగ్గర లేదు..' అని కూడా ఆమెతో ట్రంప్ అన్నాడట.

రూపర్ట్ మర్దోక్‌తో.. ఫోన్‌లో..

రూపర్ట్ మర్దోక్‌తో.. ఫోన్‌లో..

‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ది ట్రంప్‌ వైట్‌హౌస్‌' పుస్తకంలో రాతల ప్రకారం... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్‌తో ఫోన్‌లో చాలాసేపు సంభాషిస్తాడట. అమెరికా అధ్యక్ష వ్యవహారాల్లో రూపర్ట్ మర్దోక్‌ దాదాపు ఒక భాగమైపోయారట. అంతేకాదు, హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలిని రూపర్ట్ మర్దోక్‌ కూడా విమర్శించినట్లు వార్తలొచ్చాయి.

‘అదైతే దేశద్రోహమే’...

‘అదైతే దేశద్రోహమే’...

2016 జూన్‌లో రష్యా లాయర్‌తో జూనియర్‌ ట్రంప్‌ సమావేశం దేశద్రోహంగా భావించవచ్చు అని డొనాల్డ్‌ ట్రంప్‌కు గతంలో వ్యూహకర్తగా వ్యవహరించిన స్టీవ్‌ బానన్‌ చెప్పారు. ఆ తరువాత జేరెడ్ కుష్నర్‌, పాల్‌ మనఫోర్ట్‌ లాంటి ప్రచార విభాగ అధికారులు కూడా రష్యన్లతో సమావేశమయ్యారు. చివరకు ట్రంప్‌ కూడా రష్యా అధికారులను, రష్యా న్యాయవాదిని కలిశారు. ఆఖరికి ట్రంప్‌ ప్రైవేట్‌ లీగల్‌ టీమ్‌ ప్రతినిధి మార్క్‌ కొరాలో కూడా న్యాయపరమైన దర్యాప్తు జరక్కుండా ట్రంప్‌ అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారట.

ఆరోజు కూడా భార్యను ఏడిపించారు...

ఆరోజు కూడా భార్యను ఏడిపించారు...

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే రోజున ట్రంప్‌ తన భార్య మెలానియాతో తీవ్రంగా గొడవపడ్డారు. ఆమె కన్నీటిపర్యంతం అయ్యేట్లు చేశారట. ఇక ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా అయితే తన తండ్రి జుట్టు రంగును వెక్కిరించేదట. ఆ జుట్టులో ఆయన అచ్చం బఫూన్‌ లా ఉన్నాడని అనేదట. నిజానికి అమెరికాకు తానే తొలి మహిళా అధ్యక్షురాలినై చరిత్ర సృష్టించాలనే ఓ ఆరాటం, కల ఇవాంకాకు ఉన్నాయట. ఈ పుస్తక రచయిత మైఖేల్‌ వోల్ఫ్‌ ఇవాంకాను అత్యాశపరురాలైన మహిళగా అభివర్ణించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The US publisher of an explosive new book exposing chaos behind the scenes at the White House has brought publication forward to Friday in defiance of an attempt by Donald Trump’s lawyers to try to shut it down. The book’s author, Michael Wolff, tweeted: “Here we go. You can buy it (and read it) tomorrow. Thank you, Mr President.” Claims in the book about Trump’s mental stability and fitness to serve were dismissed on Thursday as “disgraceful and laughable” by the White House spokeswoman Sarah Sanders.Trump tweeted that he had never granted Wolff access to the White House and had turned down his requests many times. Describing the book as “phony”, Trump said Fire and Fury was: “full of lies, misrepresentations and sources that don’t exist”. He said he had never spoken to Wolff: “Look at this guy’s past and watch what happens to him and Sloppy Steve!”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి