వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం జడ్జి ఇంటిపై కాల్పులు,తృటిలో తప్పించుకొన్న జస్టిస్ ఇజాజ్ ఉల్ అహసాన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ఇజాజ్ ఉల్ అహసాన్ నివాసంపై ఆదివారం కాల్పులు జరిగాయి. అయితే రెండు దఫాలు జరిగిన కాల్పుల్లో జస్టిస్ అహసాన్ సురక్షితంగా ఈ దాడుల నుండి బయటపడ్డారు.

పాకిస్థాన్ సుప్రీం కోర్టుకు సమాచార సంబంధాల శాఖ అధికారులు ఈ మేరకు మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు, ఉదయం 9 గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయని ప్రకటించారు.

జస్టిస్ అహసాన్ సురక్షితంగా ఈ కాల్పుల ఘటన నుండి బయటపడ్డారు. పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మియాన్ నకిబ్ నిసార్ తక్షణమే జస్టిస్ సకిబ్ నిసార్ తక్షణమే నివాసానికి వెళ్ళి పరామర్శించారు. పంజాబ్ ఐజీ అరిఫ్ నవాజ్ ఖాన్‌కు సమన్లు జారీ చేశారు. ఈ పరిస్థితిపై ప్రధాన న్యాయమూర్తి స్వయంగా పర్యవేక్షణ జరుపుతున్నారు.

Firing At SC Judge Residence: CJP Summons IGP Punjab

న్యాయమూర్తి జస్టిస్ ఇజాజ్ నివాసానికి వెళ్ళి సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలను సేకరించింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం షెహబాజ్ షరీప్ ఈ ఘట,నపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాహిద్ కఖాన్ అబ్బాసీ ,పాకిస్థాన్ తెహరీక్ ఈ ఇన్సాప్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని ఖండించారు.

పనామా గేట్ కేసు విచారణలో జస్టిస్ ఇజాజ్ ఉల్ అహసాన్ ఉన్నారు. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుటుంబానికి ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో మాజీ ప్రధాని షరీష్ కుటుంబంపై దాఖలైన అవినీతి కేసుల్లో జస్టిస్ అహసాన్ మానిటరింగ్ జడ్జిగా ఉన్నారు.

English summary
Chief Justice of Pakistan Justice Saqib Nisar On Sunday summoned the IGP Punjab Capt (retd) Arif Nawaz Khan over the two firing incidents at the residence of the Supreme Court of Pakistan judge Justice Ijaz Ul Ahsan in Model Town area of Lahore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X