యూఎస్ లో తొలిసారిగా భారత దినోత్సవ పరేడ్; బోస్టన్ ఆకాశంలో ఎగిరిన ఇండియా-యుఎస్ జెండా

76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళలో, అమెరికాలోని బోస్టన్‌లో తొలిసారిగా భారత దినోత్సవ పరేడ్ నిర్వహించారు. భారీ భారత్-యుఎస్ జెండాను గగనతలంపై ఎగురవేసి సందడి చేశారు.

బోస్టన్ లో ఇండియా డే పరేడ్.. ఆకాశంలో 220 అడుగుల ఇండియా- యూఎస్ జెండా

బోస్టన్ లో ఇండియా డే పరేడ్.. ఆకాశంలో 220 అడుగుల ఇండియా- యూఎస్ జెండా

చారిత్రాత్మకమైన అమెరికా నగరంలో దేశ స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా జరిగిన ఇండియా డే పరేడ్ సందర్భంగా బోస్టన్‌ నగరంలో ఆకాశంలో 220 అడుగుల ఇండియా- యూఎస్ జెండాను ఎగురవేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ రెండింటిలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఇండియన్ డే పరేడ్‌కు 30 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది మంది హాజరయ్యారు. బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. బోస్టన్లోని ఇండియా స్ట్రీట్ లో ఆగస్టు 15న సంబరాలు జరుగుతున్నాయి.

గ్రాండ్ మాస్టర్ ఆఫ్ పెరేడ్ లో మాజీ భారత క్రికెట్ ఆర్పీ సింగ్

గ్రాండ్ మాస్టర్ ఆఫ్ పెరేడ్ లో మాజీ భారత క్రికెట్ ఆటగాడు ఆర్ పి సింగ్ నేతృత్వంలో, మసాచుసెట్స్ మరియు న్యూ ఇంగ్లండ్ నుండి అనేక మంది రాజకీయ నాయకులు మరియు ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది ప్రముఖ భారతీయ-అమెరికన్లు ఇండియన్ పెరేడ్ డే ను ఉద్దేశించి ప్రసంగించారు. బోస్టన్‌లో జరిగిన మొట్టమొదటి ఇండియా డే పరేడ్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ ఘనత అంతా నగరంలోని భారతీయ-అమెరికన్‌లకు మరియు దీనిని గ్రాండ్‌గా విజయవంతం చేయడానికి పగలనకా, రాత్రనకా కష్టపడి పనిచేసిన వాలంటీర్లకు చెందుతుంది అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్-న్యూ ఇంగ్లండ్ పరేడ్ నిర్వాహకుల సంఘం నాయకుడు అభిషేక్ సింగ్ అన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ .. అమెరికాలోనూ ఘనంగా

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ .. అమెరికాలోనూ ఘనంగా

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" గా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పిలుపు నుండి తాము ప్రేరణ పొందానని బోస్టన్‌లో జరిగిన ఇండియా డే పరేడ్ నిర్వాహక సంఘ నాయకుడు అభిషేక్ సింగ్ చెప్పారు. అమెరికా స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించినందుకు బోస్టన్ ప్రసిద్ధి చెందింది. కాబట్టి, ఈ చారిత్రాత్మక నగరంలో దీనిని ఘనంగా నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము అని ఆయన తెలిపారు.

220 అడుగుల భారత్-అమెరికా జెండాను ఆకాశంలో ఎగరేసి సంబరం

220 అడుగుల భారత్-అమెరికా జెండాను ఆకాశంలో ఎగరేసి సంబరం

శనివారం బోస్టన్ నౌకాశ్రయంలో ముగిసిన కవాతు సందర్భంగా, 220 అడుగుల భారత్-అమెరికా జెండాను మోసుకెళ్లిన విమానం నగరంపై ఎగురవేసింది. ఆకాశంలో ఎగురుతున్న భారతదేశపు త్రివర్ణ పతాకం ప్రజల హృదయాలను దోచుకుంది. ఇది కేవలం ఒక సాధారణ జెండా కాదు, ఇది 220 అడుగుల పొడవైన భారతీయ త్రివర్ణ పతాకం అని పేర్కొన్నారు. అది యూఎస్ జెండా తో కలిసి ఆకాశంలో కనువిందు చేయడం ప్రధానంగా కనిపించింది. అంతేకాదు ఇండియా స్ట్రీట్ అంతా ఫ్రీడం గ్యాలరీ, ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+