• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరస్ట్ ప్రెసిడెంట్ అమెరికా ఎవర్: ట్రంప్‌పై బిడెన్: మాస్కో మాజీ మేయర్ భార్య: జో కొడుక్కి ఫండ్స్

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా రిపబ్లికన్ల తరఫున రెండోసారి బరిలో నిల్చున్న డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ మధ్య ఏర్పాటైన తొలి డిబేట్.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత తలెత్తిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, పన్నుల విధానం వంటి అంశాలపై సాగింది. క్లీవ్‌ల్యాండ్‌లో ఏర్పాటైన ఈ డిబేట్.. ఇద్దరు నేతల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు అద్దం పట్టింది. అలాగే- వాడివేడిగా సాగింది. వ్యక్తిగత ఆరోపణలపైనా దిగారు. కుటుంబ సభ్యుల అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి.

  US Presidential Debate : Trump Deflects Questions About Taxes | Trump vs Joe Biden | Oneindia Telugu

  షటప్ మ్యాన్: ట్రంప్ ఫైర్: ఒబామా కేర్‌పై వాడివేడిగా ట్రంప్-బిడెన్ మధ్య డిబేట్: భారత్ ప్రస్తావన

  స్కూల్ టీచర్ల కంటే తక్కువ పన్నులు..

  స్కూల్ టీచర్ల కంటే తక్కువ పన్నులు..

  ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన టాపిక్‌పై డిబేట్ సందర్భంగా జో బిడెన్.. ఆగ్రహోదగ్రుడయ్యారు. డొనాల్డ్ ట్రంప్ చెల్లిస్తోన్న పన్నులను తప్పు పట్టారు. తాను అధికారంలోకి వస్తే ఆ తరహా పన్నుల విధానాన్ని రద్దు చేస్తాననీ హామీ ఇచ్చారు. ట్యాక్స్ కోడ్ విధానం వల్ల అతి తక్కువ పన్నును డొనాల్డ్ ట్రంప్ చెల్లిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నామమాత్రంగా వసూలు అవుతున్నాయని చెప్పారు. ట్యాక్స్ కోడ్ వ్యవస్థ వల్ల డొనాల్డ్ ట్రంప్ స్కూల్ టీచర్ల కంటే తక్కువ పన్నులను చెల్లిస్తున్నారని చెప్పారు. తాను ట్యాక్స్ కోడ్ విధానాన్ని రద్దు చేయబోతున్నానని జో బిడెన్ చెప్పారు.

  అధ్వాన్నపు అధ్యక్షుడిగా..

  అధ్వాన్నపు అధ్యక్షుడిగా..

  ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అధ్వాన్నపు అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారని ఆరోపించారు. బిడెన్ చేసిన ఆరోపణలను ట్రంప్ తిప్పికొట్టారు. తాను మిలియన్ డాలర్ల కొద్దీ పన్నులను చెల్లించినట్లు తెలిపారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనాన్ని ఉటంకించారు. 2015 నుంచి తాను చెల్లిస్తోన్న పన్నుల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని అన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఏడు బిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తామని జో బిడెన్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తామ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని బిడెన్ చెప్పారు.

  జో బిడెన్ కుమారుడికి ఎక్కడి నుంచి నిధులు..

  జో బిడెన్ కుమారుడికి ఎక్కడి నుంచి నిధులు..

  ఊహించినట్టే- జో బిడెన్ కుమారుడు హంటర్ ఆర్థిక కార్యకలాపాలు ఈ డిబేట్‌లో ప్రస్తావనకు వచ్చాయి. హంటర్..ఉక్రెయిన్, చైనా, రష్యాలతో అక్రమంగా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. రష్యా, చైనాల నుంచి పెద్ద ఎత్తున హంటర్‌కు నిధులు సమకూరాయని విమర్శించారు. ఈ అంశాన్ని మీడియా తొక్కి పెట్టిందని, అండర్ ప్లే చేస్తోందని మండిపడ్డారు. మూడున్నర మిలియన్ డాలర్ల మేర నిధులు హంటర్‌కు అక్రమంగా అందాయని, మాస్కో మాజీ మేయర్, దివంగత యూరీ భార్య నుంచి ఈ మొత్తం ఆయనకు ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పారు. దీనికి జో బిడెన్ బదులిస్తూ.. అలాంటివి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. కుటుంబ సభ్యులను లాగడం సరికాదని బిడెన్ అన్నారు.

  English summary
  You're the worst president we've ever had, Democratic Candidate Joe Biden tells US President Donald Trump. Joe Biden said "The tax code that put him in a position where he pays less tax than a school teachers is because he took advantage of the tax code. I am going to eliminate these tax codes and invest in the people who need help.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X