అమెరికాలో కాల్పులు, ఐదుగురి మృతి, పలువురికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది, ఓ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది, ఓ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసు బలగాలు హతమార్చాయని ఒర్లాండోని ఆరేంజ్ కౌంటీ షరీఫ్ తెలిపారు.

ఫోర్సిత్ రోడ్డు, హ్యాంగింగ్, మాస్ రోడ్డులో ఈ కాల్పులు చోటుచేసుకొన్నట్టు అధికారులు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే భద్రతాబలగాలు పెద్ద మొత్తంలో ఎమర్జెన్సీ వాహానాలతో కాల్పులు జరిగిన చోటుకు చేరుకొన్నాయి.
గత ఏడాది ఇదే ఓర్లాండ్ లోని పల్స్ నైట్ క్లబ్బులో కాల్పులు చోటుచేసుకొని 49 మంది చనిపోయారు. ఏడాది తిరగకుముందే అదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications