వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఈ రోజు పబ్లిక్ హాలీడే, అయినా టెన్షన్.. టెన్షన్, ఎందుకంటే..

మామూలు రోజుల్లో కంటే సెలవు దినాల్లో అమెరికన్లు ఇంకా అధికంగా భయపడుతున్నారు. ఈరోజు అంటే.. అక్టోబరు 10 కొలంబస్ డే.. అమెరికాలో పబ్లిక్ హాలీడే. అయినా అమెరికన్లు ఎవరూ సంతోషంగా గడపలేకపోతున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియా వివాదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అంతేకాదు, అమెరికాలో నివసించే ప్రజలను కూడా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. సెలవు దినాల్లో ఈ భయం మరింత అధికమవుతోంది.

అంతర్జాతీయ సమాజం ఎంత ఒత్తిడి తెచ్చినా ఉత్తరకొరియా వెనక్కి తగ్గకపోవడం అమెరికన్లలో గుబులు పుట్టిస్తోంది. అటు చైనాతో చెప్పించినా, ఇటు ఐక్యరాజ్య సమితితో ఆంక్షలు విధింపజేసినా ఉత్తరకొరియా నియంత కిమ్ పై అవేమీ పనిచేయడం లేదు.

సెలవు దినాల్లో మరింత భయం...

సెలవు దినాల్లో మరింత భయం...

మామూలు రోజుల్లో కంటే సెలవు దినాల్లో అమెరికన్లు ఇంకా అధికంగా భయపడుతున్నారు. ఈరోజు అంటే.. అక్టోబరు 10 కొలంబస్ డే.. అమెరికాలో పబ్లిక్ హాలీడే. అయినా అమెరికన్లు ఎవరూ సంతోషంగా గడపలేకపోతున్నారు. కారణం ఉత్తరకొరియాతో పొంచి ఉన్న యుద్ధ భయం. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఏ క్షణంలో ఏ క్షిపణి ప్రయోగిస్తారో అనే భయం అమెరికన్ల కంటికి కునుకు లేకుండా చేస్తోంది.

 ఆపైన.. ప్రకృతి బీభత్సంతో చస్తుంటే...

ఆపైన.. ప్రకృతి బీభత్సంతో చస్తుంటే...

ఇటీవలి వరుస హరికేన్లతో అమెరికాలోని పలు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. మరోవైపు అప్పుడప్పుడూ అడవుల్లో రగిలే కార్చిచ్చు కాలుస్తూనే ఉంది. ఇంకోవైపు ఎక్కడోచోట ఏదో ఒక అగ్నిపర్వతం బద్దలవుతూనే ఉంటోంది. ఇలా పగబట్టిన ప్రకృతి సృష్టించే బీభత్సాలకు తోడు ఉత్తరకొరియా నియంత కిమ్ చేతిలో అణుబాంబు ‘పిచ్చోడి చేతిలో రాయి'లా మారడంతో అమెరికా ప్రజలు గడగడ వణుకుతున్నారు.

అగ్రరాజ్యం శక్తి తెలిసీ...

అగ్రరాజ్యం శక్తి తెలిసీ...

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య జరిగే మాటల యుద్ధం కూడా అమెరికన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా శక్తి ఏమిటో యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయినా సరే.. ఉత్తరకొరియా అధ్యక్షుడు ఢీ అంటే ఢీ అంటుండడంతో ఏ క్షణంలో ఏం జరగుతుందోని వారు భయపడుతున్నారు. వీరిద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధం.. ఎక్కడ చేతల వరకు వెళుతుందో అన్నదే అందరి ఆందోళన.

మరింత భయపెట్టిన రష్యా నేత వ్యాఖ్యలు...

మరింత భయపెట్టిన రష్యా నేత వ్యాఖ్యలు...

ఉత్తరకొరియాలో ఇటీవల రష్యా నేత, చట్ట సభ్యుడు అంటోన్ మోరోజోవ్ పర్యటన సమయంలో చేసిన హెచ్చరిక కూడా అమెరికా ప్రజలను భయపెడుతోంది. మామూలు రోజుల్లో కంటే.. అమెరికా సెలవు దినాల్లోనే కిమ్ జాంగ్ ఉన్ క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని, ఈసారి అమెరికాను చేరుకోగల క్షిపణిని కిమ్ ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన హెచ్చరించడాన్ని వారు మర్చిపోలేదు. అంతేకాదు, అక్టోబరు 10న అమెరికా సెలవు దినం కావడం, ఉత్తరకొరియా పార్టీ డీపీఆర్కే వార్షికోత్సవం కూడా కావడంతో ఆ సందర్భంగా ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించే అవకాశముందని అంటోన్ మోరోజోవ్ పేర్కొన్నారు.

ట్రంప్‌ నేతృత్వంలో ...

ట్రంప్‌ నేతృత్వంలో ...

ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న దుందుడుకు వ్యాఖ్యలు దేశాన్ని క్రమేణా మూడో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకువెళ్లేలా ఉన్నాయని అధికార రిపబ్లికన్‌ పార్టీ అగ్రశ్రేణి నేత బాబ్‌ కార్కర్‌ కూడా వ్యాఖ్యానించారు. శక్తిమంతమైన విదేశీ వ్యవహారాల సెనేట్‌ కమిటీకి బాబ్‌ అధ్యక్షునిగా ఉన్నారు. అధికార పార్టీ సభ్యునిగా ఉంటూ ప్రభుత్వంపై ఆయన అసాధారణ రీతిలో విమర్శలు చేశారు. బాబ్, ట్రంప్ ఒకప్పుడు మిత్రులు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ట్రంప్‌ ఒక రియాలిటీ షో మాదిరిగా నడిపిస్తున్నారని బాబ్‌ కార్కర్‌ దుయ్యబట్టారు. ఇరాన్‌ అణు ఒప్పందం, పన్ను సంస్కరణల ఆమోదాలకు కార్కర్‌ ఓటు కీలకం. ఈ నేపథ్యంలో అధ్యక్షునికి ఆయనకు మధ్య తలెత్తిన అగాధం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ట్రంప్ మాటలకు అర్థమదేనా?

ట్రంప్ మాటలకు అర్థమదేనా?

సెలవుదినాల్లో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగించే అవకాశం ఉందని తెలియగానే అమెరికా ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇక ఉత్తరకొరియాకు వేయడానికి ఒకే ఒక మందు ఉంది అంటూ ఇటీవల వ్యాఖ్యానించడం కూడా పరోక్షంగా యుద్ధాన్నే సూచిస్తుండడంతో యుద్ధం వస్తే ఏలా ఉంటుందోనని అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉత్తరకొరియా క్షిపణులను పగటి పూట ప్రయోగిస్తుందా? లేక రాత్రివేళ ప్రయోగిస్తుందా? అనేది చర్చనీయాంశమైంది.

English summary
October 10, is a public holiday for Americans as they celebrate this day as Columbus Day. But especially this year, people of America fearing to celebrate also. Because of the words of Russian Leader Anton Morozov who went to North Korea on Official Tour and made a comments about Kim Jong Un's strategy about deploying missiles towards America. On the other hand Republican Sen. Bob Corker also now warning that President Donald Trump is setting the US on a potential “path to World War III.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X