Kargil War: కార్గిల్ వార్ లో పాకిస్తాన్ ఆర్మీ పాత్ర ! తొలిసారి అంగీకారం..!
199లో భారత ప్రధాని వాజ్ పేయ్ తో పాకిస్తాన్ సైనిక నియంత జనరల్ ముషారఫ్ చర్చలు జరిపి వెళ్లిన తర్వాత దీన్ని అంగీకరించని ఆయన సైన్యం కార్గిల్ చొరబడింది. భారత సైన్యంతో హోరాహోరీ పోరు తర్వాత చాలా మంది సైనికుల్ని కోల్పోయింది. దీంతో కార్గిల్ ను భారత్ కే వదిలేసి మిగిలిన వారితో వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత కార్గిల్ వార్ లో ఓడిపోయినట్లు అంగీకరించడం ఇష్టం లేక.. పాకిస్తాన్ సైన్యం పాత్ర లేదంటూ వాదించడం మొదలుపెట్టింది.
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కార్గిల్ యుద్ధంలో తమ సైనికుల పాత్ర ఉందని అంగీకరించారు. భారత్ తో జరిగిన కార్గిల్ యుద్దం సహా పలు యుద్దాల్లో భారీ సంఖ్యలో తాము సైనికుల్ని కోల్పోయినట్లు ఇవాళ మునీర్ వెల్లడించారు. రావల్పిండిలో జరిగిన పాకిస్తాన్ ఆర్మీడే సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. దీంతో ఇన్నాళ్లు కార్గిల్ యుద్దం విషయంలో పాకిస్తాన్ చేస్తున్న వాదన ఒట్టిదే అని తేలిపోయింది.

భారత్ తో జరిగిన 1948,1965,1971 యుద్ధాలు కావచ్చు, లేదా 1999లో జరిగిన కార్గిల్ యుద్దం కావచ్చు.. వేల మంది పాకిస్తాన్ సైనికులు దేశం కోసం, ఇస్లాం కోసం అమరులైనట్లు ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ వెల్లడించారు. గతంలో కార్గిల్ యుద్దంలో ముజాహిదీన్లు లేదా స్వాతంత్ర సమరయోధుల పాత్ర ఉన్నట్లు చెబుతూ వచ్చిన పాకిస్తాన్.. తొలిసారి ఇలా బహిరంగంగా కార్గిల్ యుద్దంలో తమ పాత్ర ఉన్నట్లు అంగీకరించింది. అప్పట్లో లడఖ్, టైగర్ హిల్ ప్రాంతాల్లో మూడు నెలల పాటు జరిగిన పోరు తర్వాత తిరిగి కార్గిల్ ను భారత సైన్యం చేజిక్కంచుకుంది.












Click it and Unblock the Notifications