మాజీ మిస్ యూనివర్స్ క్సేనియా అలెగ్జాండ్రోవా మృతి.. కారు ప్రమాదంలో !

రష్యాకు చెందిన ప్రముఖ మోడల్‌, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్‌ "క్సేనియా అలెగ్జాండ్రోవా" (30) దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేవలం నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఆమె ఆకస్మిక మరణం రష్యా అంతటా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

జూలై 5న క్సేనియా తన భర్తతో కలిసి ర్జేవ్‌ నుండి ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఒక భారీ ఎల్క్‌ (అడవి జంతువు) రోడ్డుపైకి అకస్మాత్తుగా దూసుకొచ్చింది. కారు ఢీకొనడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో ప్యాసింజర్ సీటులో కూర్చున్న క్సేనియాకు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఇతర వాహనదారులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయం అందించి మాస్కో ఆసుపత్రికి తరలించినా, ఆమె పరిస్థితి విషమించి చివరికి ప్రాణాలు కోల్పోయారు.

former-miss-universe-contestant-ksenia-alexandrova-dies-in-car-accident

మోడలింగ్‌లో గుర్తింపు..

క్సేనియా 2017లో మిస్ రష్యా పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. అదే ఏడాది రష్యా తరపున మిస్ యూనివర్స్ పోటీలో కూడా పాల్గొని విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ర్యాంప్‌పై అందంతో పాటు ఆత్మవిశ్వాసంతో నడిచిన తీరు అనేక మందిని ఆకట్టుకుంది.

వ్యక్తిగత జీవితం

మోడలింగ్‌తో పాటు విద్యలోనూ క్సేనియా ప్రతిభ కనబరిచారు. మాస్కో పెడగాజికల్ స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీలో పట్టభద్రురాలయ్యారు. తన సౌందర్యంతో పాటు మేధస్సు, ప్రతిభ, వినయశీలత కలగలిపిన వ్యక్తిత్వం ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి.

గత మార్చి 22న ఆమె తన ప్రియుడితో వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కానీ పెళ్లి అయిన నాలుగు నెలలకే జరిగిన ఈ ప్రమాదం ఆమె జీవితాన్ని అకాలంగా ముగించింది.

క్సేనియాకు రష్యాలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులు ఉన్నారు. ఆమె మరణంతో ఫ్యాషన్‌, మోడలింగ్‌ రంగాలు తీవ్ర విషాదంలో మునిగాయి. పలువురు మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్లు, రష్యన్ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. రోడ్లపై వన్యప్రాణుల రాకపోకలను అరికట్టే చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

భర్త యొక్క వేదన

ఈ ఘటనపై తన వేదనను వ్యక్తం చేస్తూ ఆమె భర్త కన్నీటి పర్యంతమయ్యారు. “జంతువు ఒక్కసారిగా రోడ్డుపైకి దూకింది. క్షణాల్లోనే మా కారు ఢీకొట్టింది. దాంతో క్స్యూషా తలకు బలమైన గాయం అయ్యింది. రక్తస్రావం ఆగలేదు” అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+