వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశద్రోహి ముద్ర: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ కు ఉరిశిక్ష

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ కు మరణ శిక్ష పడింది. పెషావర్ లోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువడించింది. పర్వేజ్ ముషర్రాఫ్ ను చాలాకాలం నుంచి వెంటాడుతోన్న హైట్రిజన్ కేసులో పెషావర్ న్యాయస్థానం ఈ తీర్పును ఇవ్వడం సంచలనం రేపుతోంది. తన పాలనా సమయంలో పర్వేజ్ ముషర్రాఫ్ దేశద్రోహానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణలపై పెషావర్ లోని ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మత్ సేఠ్ సారథ్యంలో జస్టిస్ నజర్ అఖ్తర్, జస్టిస్ షాహిద్ కరీంలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసులపై సమగ్ర విచారణ నిర్వహించింది. నజర్ అఖ్తర్ సింధ్ హైకోర్టుకు, షాహిద్ కరీం లాహోర్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు.

Former Pakistan president Pervez Musharraf gets death penalty

పర్వేజ్ ముషర్రాఫ్ పై వచ్చిన ఆరోపణలు, పిటీషన్లు, ఇతర సాక్ష్యాధారాలపై విచారణ జరిపిన అనంతరం ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం పర్వేజ్ ముషర్రాఫ్ దుబాయ్ లో నివసిస్తున్నారు. 2009 నుంచి 2013 వరకు ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పని చేశారు. సైనిక ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఈ చర్య దేశద్రోహం కిందికి వస్తుందంటూ అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ విచారించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది.

English summary
In an unprecedented development in the history of Pakistan, a three-member bench of the special court on Tuesday handed death sentence to former president Pervez Musharraf in the long-drawn high treason case against him. A three-member bench of the special court, headed by Peshawar High Court (PHC) Chief Justice Waqar Ahmad Seth, heard the case against Musharraf.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X